విజయ్ కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: జూత్తడా గ్రామంలో చనిపోయిన విజయ్ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. విజయ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.  నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ1 అప్పలరాజుని ఈ రోజే పోలీస్ కష్టడికి తీసుకోవాలని కోరామని.. ఈ కేసులో ఏ2గా ఉన్న బత్తిన శీనును సస్పెండ్ చేయమని సీపీని కోరినట్లు చెప్పారు. బత్తిన శీను హస్తం కూడా ఉందని రుజువైతే అతనిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 14 రోజులు దాటితే ఇంకా అప్పలరాజుని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండదన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ తరుపున చనిపోయిన వారికి నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి రూ.2 లక్షలు మొత్తం 12 లక్షల చొప్పున చెల్లిస్తామని స్పష్టం చేశారు. కుటుంబాన్ని కోల్పోయిన విజయ్‌, లీలావతికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, విజయ్ కుమారుడికి ఉన్నత చదువులు చదివిస్తామని తెలిపారు. ఏ1 అప్పలరాజును ఇంత వరకు కస్టడీకి తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. సీపీని ఈ కేసును సీరియస్‌గా తీసుకోమని చెప్పామని...ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశించారు.

వి.జుత్తాడ మారణకాండ విషాద ఛాయలు శుక్రవారం శివాజీపాలేన్ని కమ్మేశాయి. అంత్యక్రియల పర్వాన్ని ప్రత్యక్షంగా చూసిన శివాజీపాలెమంతా కంటతడిపెట్టుకుంది. బాధితుడు బమ్మిడి విజయ కిరణ్‌ తాతయ్య చెల్లుబోయిన అప్పారావుది శివాజీపాలెం కావడంతో హత్యకు గురైన ఆరు మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలను కేజీహెచ్‌ నుంచి శివాజీపాలెం తీసుకొచ్చారు. అప్పటికే పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లుసిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి మహాప్రస్థానం వాహనాల్లో అప్పారావు ఇంటికి మృతదేహాలు చేరుకోగా కనీసం వాటిని కిందకు దించలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి అటే శ్మశానవాటికకు తరలించారు.  

Back to Top