తెలుగు రాష్ట్రాల మధ్య చట్టబద్ధంగా విభజన జరగలేదు

రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ:  తెలుగు రాష్ట్రాల మధ్య చట్టబద్ధంగా విభజన జరగలేదని రాజ్యసభలో వైయస్‌ఆర్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9,10 కింద సంస్థలు, ఆస్తుల పంపకంపై  కేంద్రాన్ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు, సంస్థల విభజన ప్రక్రియ వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటని నిలదీశారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆస్తులు, సంస్థల విభజన జరుగుతుందని విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. 
 

తాజా వీడియోలు

Back to Top