రాయలసీమకు నీరు తీసుకెళ్లడం బాబుకు ఇష్టం లేదా?

విశాఖపై చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు

28వ తేదీ చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటించాలి

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

విశాఖ: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తీసుకెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. జీవో నంబర్‌ 203పై ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అభిప్రాయం చెప్పాలన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. అమరావతిలో తన బినామీల ఆస్తులు కావాడాలన్నదే చంద్రబాబు తాపత్రయం అన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఎల్లో మీడియా విశాఖపై విష ప్రచారం చేస్తుందన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను చంద్రబాబు లాక్కున్నారన్నారు. కరోనాను చూసి చంద్రబాబు భయపడటం లేదన్నారు. కరోనానే చంద్రబాబును చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా చంద్రబాబు  అనధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈ నెల 28న ఎన్‌టీఆర్‌ జయంతి సందర్భంగానైనా అధికారికంగా చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటించాలని సూచించారు. కరోనాకు టీకా వచ్చే వరకు హైదరాబాద్‌ ఇళ్లు వదిలి రారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులపై ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. సీబీఐ,ఈడీ, ఐటీని రాష్ట్రానికి రావద్దని చంద్రబాబు అనలేదా అని నిలదీశారు. 
 

Back to Top