న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చంద్రముఖిగా మారి వ్యవస్థలోకి ప్రవేశించారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల పరంగా జరగవు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుతాయని తెలియదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని నిలదీశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు కృషి చేస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరామని, బ డ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశంపై పోరాటం చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి సవరణను ప్రతిపాదిస్తామన్నారు. అభివృద్ధి పెంచే విధగా కేంద్ర బడ్జెట్ తీర్చిదిద్దాలని కోరుతామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన విధంగా నిధులు ఇవ్వాలని, విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలని, పారిశ్రామిక వ్యవసాయ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరుతామన్నారు. నదుల అనుసంధానం చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలన్నదే మా పార్టీ అభిమతమన్నారు. జాతీయ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రైవేట్ బిల్లు పెడుతున్నామని చెప్పారు. బడ్జెట్ అన్నది అభివృద్ధి కాంక్షించే విధంగా ఉండాలన్నారు. మొదటి నుంచీ నిమ్మగడ్డది పక్షపాతధోరణీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ది మొట్ట మొదటి నుంచి కూడా పక్షపాత ధోరణే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఎస్‌ఈసీ ధోరణి సరిగా లేదని తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతో నిమ్మగడ్డ లాలూచీ పడ్డారని మండిపడ్డారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం విచారకరమన్నారు. కరోనా ఉందని అప్పుడు ఎన్నికలు నిలిపివేశారు. కరోనా పరిస్థితులు తగ్గకపోయినా ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఫైర్‌అయ్యారు. గతంలో ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఇప్పుడు అదే ధోరణితో ఉన్నారు. అధికారులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ సలహాదారులను తొలగించాలని, మంత్రులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేస్తున్నారని తప్పుపట్టారు. చంద్రబాబుకు ఆ మాత్రం తెలీదా? పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో పైవరుసలో మూడు ఫోటోలు పెట్టారని అందులో ఒకరు మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి ఉన్నారన్నారు. మరొకరు చంద్రబాబు వెన్నుపోటు పొడిన వ్యక్తి ఎన్టీఆర్ ఉన్నారన్నారు. దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న వారికి అధ్యక్షుడు చంద్రబాబే అని ఎద్దేవా చేశారు.వెన్నుపోటుదారుల జాతీయ సంఘానికి చంద్రబాబు అ«ధ్యక్షుడని విమర్శించారు.స్వప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డది.. చంద్రబాబు చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలోకి ప్రవేశించారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రముఖిగా మారి నిమ్మగడ్డను చంద్రబాబు ఆడిస్తున్నారని వ్యాఖ్యానించారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డని పేర్కొన్నారు. పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగపదవిలో ఉండి ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను నాడు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పారని ఇప్పుడు నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. అధికారులు ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని, నిమ్మగడ్డ మానసిక పరిస్థితి సరిగా లేక హడావుడి చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలో కూడా నిమ్మగడ్డకు తెలీదన్నారు. నిమ్మగడ్డ అనే వ్యక్తిపైనే మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. నిమ్మగడ్డ..కందగడ్డ..ఉల్లిగడ్డ ఇలా ఎన్ని గడ్డలు ఉన్నాయో లె లీదని, ఆయన్ను మాత్రం కచ్చితంగా ఎ్రరగడ్డ ఆసుపత్రిలో చేర్చించాల్సిందేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.