గత మెజారిటీని మించి విజయం సాధించాలి

సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలి

టిడిపి కుట్రలను తిప్పి కొట్టాలి

మంగళగిరి పార్టీ నాయకులు, కార్యకర్తలతో రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి

 తాడేపల్లి: మంగళగిరిలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వచ్చే విధంగా పని చేయాలని పార్టీ నాయకులు,కార్యకర్తలకు వైజ్ఞ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,పార్టీ పార్లమెంటరీ నాయకులు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.
మొదటిగా నియోజకవర్గంలో ఈ నెల 31న పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర ను విజయవంతం చేయాలని  కోరారు.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జగనన్న సైనికులతో శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించారు.
నియోజకవర్గ సమన్వయకర్త  గంజి చిరంజీవి,  మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలానికి నాయకులు,కార్యకర్తలు ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ విజయసాయిరెడ్డి  మాట్లాడుతూ ఈ నెల 31న సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళగిరిలోని వైయస్సార్ విగ్రహం వద్ద నుంచి ముందుగా పాదయాత్ర ప్రారంభమై లక్ష్మీ నరసింహ స్వామి గోపురం మీదుగా  మిద్దే సెంటర్ వరకు సాగుతుందని చెప్పారు.ఈ సమావేశానికి రాష్ట్రంలోని బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీలకు చెందిన నాయకులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు...  ఈ నియోజకవర్గంలో మొదలు పెడుతున్న మొదటి కార్యక్రమం కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
ఇక్కడ నుండి టిడిపి నాయకుడు లోకేశ్ ఇక్కడ పోటి చేస్తున్నాడు...గతంలో ఓటమి చెందాడు కాబట్టే.కుమారుడు లోకేష్ ను గెలిపించేందుకు చంద్రబాబు నాయుడు సతవిధాలుగా ప్రయత్నాలు చేస్తాడని, ఈ నియోజకవర్గ ఏం చేయడానికి అయినా వెనకడుగు వేయాడని, ప్రజలు మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడని అన్నారు.. చెయ్యగలిగినది, చేయలేని హామీలను కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు.
అలాగే  నియోజకవర్గంలో కుట్రలు చేసే అవకాశం లేకపోలేదన్నారు..వాటన్నిటినీ మనం అధిగమించాల్సి ఉందన్నారు.. తెలుగుదేశం పార్టీకి దీటుగా సమాధానం చెప్పేందుకు మొదటిగా సాధికార బస్సు యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పారు..

 త్వరలో పార్టీ కమిటిలు

మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, తాడేపల్లి టౌన్, తాడేపల్లి రూరల్, దుగ్గిరాల మండలాలకు పార్టీ కమిటీలు త్వరలో నియమించనున్నట్లు ఆయన చెప్పారు..ఇందులో అన్ని సామాజిక వర్గాలకు ప్రధాన్యత ఉండేలా చూసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు చెప్పారు..ఈ కమిటీలు వేసే సమయంలో అందరి అభిప్రాయాలను పార్టీ తీసుకుంటుందని చెప్పారు.

 గంజి చిరంజీవితో కలిసి నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటా

భవిష్యత్తులో గంజీ చిరంజీవితో కలిసి నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని విజయసాయి రెడ్డి హామీ ఇచ్చారు..ఒక పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూనే  ఉంటాయాని,మరోక విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నా ఎంపి లాండ్స్ నిధులు నుండి నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు..ఈ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నా వంతు సహాయం చేస్తానన్నారు..  మీ సమస్యలను ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా పరిష్కరించడానికి రీజనల్ కోఆర్డినేటర్ గా నేను సిద్ధంగా ఉంటానని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు..

 సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా బిసి,ఎస్సి,ఎస్టీ,మైనారిటీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్ బాటాలు వేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా,దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పారు.. ఈ విషయాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో అలాగే భవిష్యత్తులో కూడా మనం ఏం చేయబోతున్నామో చెప్పేందుకే ఈ సామాజిక సాధికార బస్సు యాత్రను 175 నియోజకవర్గాల్లో చేపట్టడం జరుగుతుందన్నారు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంగళగిరి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.. గడపగడపకు మన ప్రభుత్వం, గుడ్ మార్నింగ్ మంగళగిరి, కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్తే అక్కడ సమస్యలు మనకు అర్థమవుతాయని చెప్పారు.. ఈ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్త మీద ఉందని ఆయన చెప్పారు..ఈ సమావేశాలలో నియోజకవర్గ పరిశీలకు రాపాక శ్రీనివాస్,నియోజకవర్గ  నాయకులు వేణుగోపాలరెడ్డి, వివేక్, డేవిడ్ రాజు, మల్లేశ్వరరావు, దనబోయిన సంతోష్ రుపారాణి, తదితరులు ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
 

Back to Top