బాబుకు పట్టిసీమపై ఉన్న శ్రద్ధ పోలవరంపై లేదని టీడీపీకి తెలుసు కదా?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి  

తాడేప‌ల్లి:   చంద్ర‌ బాబుకు పట్టిసీమపై ఉన్న శ్రద్ధ పోలవరంపై లేదని టీడీపీకి తెలుసు కదా? అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి  ప్ర‌శ్నించారు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు చివరిసారిగా సీఎం అయిన ఏడాదికే 2015లో హడావుడిగా చేపట్టిన పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ పోలవరంపై ఉండి ఉంటే నేడు ఇంత జాప్యం అయ్యేది కాదు. కేంద్రంలో మిత్రపక్షం అధికారంలో ఉన్నాగాని ఆయనకు పోలవరం పూర్తి చేయాలనే పట్టుదల లేదు. 

కేవలం కాసులు పండించుకోవడానికి పట్టిసీమను ‘రికార్డు’ సమయంలో బాబుగారి ప్రభుత్వం పూర్తి చేయించింది.  ఇప్పుడేమో పోలవరం జాప్యానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే తప్పన్నట్టు టీడీపీ భజన బృందం ‘చిందులు తొక్కుతోంది.’ 

2015లో పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం మొదలుపెట్టించి మరుసటి ఏడాదికే పూర్తి చేయించారు. దీని కోసం భారీ మొత్తంలో చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. అంతే మొత్తంలో లబ్ధి పొందింది. 

ఇంతటి ‘ఘన చరిత్ర’ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం వింతగా ఉందని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top