ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే వాతలు పెట్టి తరిమేశారు..

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

రివర్‌ కన్జర్వేషన్‌ యాక్ట్‌ను ఒకసారి చదవండి యనమల గారూ..ఎవరో తుగ్లకో తెలుస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.నది తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండ్‌ చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది.ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా..ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారని ట్విట్‌ చేశారు. పోలవరం అంచనాల ఆమోదం,నిధుల గురించి సీఎం ప్రధానిని కోరారు.దానికి స్పందనగానే రూ.55,548 కోట్లు సవరించిన అంచనాకు గ్రీన్‌సిగ్నల్‌..ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్‌ డప్పు కొట్టుకోవడం ఆపాలి.‘ఖర్చుచేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top