వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌కు ఎంపీ గురుమూర్తి ప‌రామ‌ర్శ‌

 తంగా పేచీ రాజ్ పై దాడి తీవ్రంగా ఖండించిన‌ ఎంపీ  

తిరుప‌తి: టీడీపీ గుండాల దాడిలో గాయపడి తిరుపతి రూయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్త తంగా పేచీ రాజ్ ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎవరూ ప్రోత్సహించ రాదని ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడుస్తున్నా కూడా అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఈ దాడికి సంబంధించి స్థానిక సీఐతో మాట్లాడి విచారణ పారదర్శకంగా జరిపి నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

Back to Top