పిడుగుపాటు మృతుని కుటుంబానికి ఎంపీ ఆదాల ఆర్థిక సహాయం

 నెల్లూరు:  రూరల్ మండలంలోని కొమ్మరపూడి గ్రామంలో పిడుగుపాటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శనివారం తన సొంత నిధుల నుంచి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిడుగుపాటుకు గురైన లక్ష్మయ్య కుటుంబాన్ని చూస్తే చాలా బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం విషయంలో అన్ని విధాల చేయూతని అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన సహాయాన్ని డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top