వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో మ‌ద‌ర్ థెరిస్సా జ‌యంతి వేడుక‌లు

 
క‌ర్నూలు:  విశ్వమాత మదర్ థెరిస్సా 111వ జయంతి వేడుక‌లు క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఎమ్మిగనూరు పట్టణంలోని ఎం.బి చర్చి వ‌ద్ద   మదర్ థెరిస్సా విగ్రహ ఏర్పాటు భూమి పూజ, ఆమె చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేశారు.  వైయ‌స్ఆర్ సీపీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు ఎర్ర‌కోట జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.   ఈసందర్భంగా ఎర్రకోట జగన్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. మదర్ థెరిసా  పేద‌ల‌కు ఎన్నో  సేవా కార్య‌క్ర‌మాలు చేశార‌ని గుర్తు చేశారు. ఎయిడ్స్, కుష్టు,  క్షయతో బాధపడుతున్న ప్రజలకు ధర్మశాలలు , ఆశ్ర‌మాలు, చికిత్సాలయాలు, మొబైల్ క్లినిక్స్‌, బాలల, కుటుంబ సలహా కార్యక్రమాలు, అనాథాశ్రమాలు , పాఠశాలలు నడిపించార‌న్నారు. ఆమె స్థాపించిన ట్ర‌స్ట్‌ సభ్యులు, పవిత్రత, పేదరికం, విధేయతలతో ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. మదర్ థెరిస్సా 1979 సంవత్సరంలో "నోబెల్ శాంతి" బహుమతితో సహా అనేక గౌరవాలను అందుకున్నార‌ని వివ‌రించారు. ఆమె స్ఫూర్తితో  సేవా కార్య‌క్ర‌మాలు చేయాల‌ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు సునీల్ కుమార్,  దేవారాజ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు గారు, మున్సిపల్ వైస్ చైర్మన్  డి.నజీర్ ఆహ్మద్ గారు, దివ్వకళ గారు, మున్సిపల్ కమిషనర్ ఎం. క్రిష్ణా, డిఈఈ లు వేంకటేశ్వర్లు,  మనోహర్ రెడ్డి,  కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య ,  మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ ,  కో ఆప్షన్ మెంబర్స్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, సోషల్ మీడియా టీం మన్సూర్ బాషా,  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top