కుప్పం: వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హంద్రీనీవా కాలువ పనులను యుద్ద ప్రాతిపదిన పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలను తీసుకువచ్చారని వైయస్ఆర్‌సీపీ కుప్పం నియోజకర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ కెఆర్‌జే భరత్ స్పష్టం చేశారు. కుప్పంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన ఇందుకు సంబధించిన వివరాలను వెల్లడించారు. కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించడంలో చంద్రబాబు దీర్ఘకాలం సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని భరత్ మండిపడ్డారు. చంద్రబాబు చేయలేని పనిని సీఎంగా వైయస్ జగన్ పూర్తి చేసి మరీ 2024 ఫిబ్రవరి 26న కృష్ణా జలాలను కుప్పంకు విజయవంతంగా తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు తానే కుప్పానికి కృష్ణా జలాలను తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఈ రోజు కుప్పం నియోజకవర్గంకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు రావడం సంతోషకరం. మొట్టమొదటి సారిగా చంద్రబాబు కుప్పానికి ఈ జలాలను తీసుకువచ్చారని కూటమి పార్టీల నాయకులు, ముఖ్యమంత్రి టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడం సరికాదు. 2014లో పలమనేరు వరకు పూర్తయ్యిన హంద్రీనీవా కాలువలను కుప్పానికి తీసుకురావడానికి రూ.150 కోట్లతో అంచనాలు వేశారు. అయితే ఆ అంచనాలను 450 కోట్లకు పెంచి తనకు కావాల్సిన వారికి కాంట్రాక్ట్‌లను కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ఇందుకోసం కాలువ పనులను జాప్యం చేశారు. తరువాత 2019 ఎన్నికల సమయంలో ప్రజలను తాను హంద్రీనీవా నీటిని కుప్పంకు తీసుకువస్తానంటూ మభ్యపెట్టేందుకు పలమనేరులో వాటర్ ట్యాంకర్లతో ఆ కాలువను నింపి జలహారతి కార్యక్రమంలో సీఎం హోదాలో చంద్రబాబు పాల్గొన్నారు. 2019లో సీఎంగా వైయస్ జగన్ అధికారం చేపట్టిన తరువాత, రెండేళ్ళ పాటు కరోనా సంక్షోభం వెంటాడినా, ఆ కాలువ పనులకు కోర్ట్‌ల ద్వారా ఆటంకాలు ఎదురైనా సరే వాటన్నింటినీ అధిగమించి 2024 ఫిబ్రవరి 26వ తేదీన సీఎంగా వైయస్ జగన్ కృష్ణా జలాలను కుప్పంకు తీసుకువచ్చి ఒక చరిత్ర సృష్టించారు. ఆనాడు వైయస్ జగన్ చిత్తశుద్దితో వ్యవహరించడం వల్లే నేడు కృష్ణాజలాలు కుప్పంనకు రాగలుగుతున్నాయనేది నిజం. కుప్పం నియోజకరవ్గ ప్రజకలు మరింత మేలు జరగాలంటే, ఇప్పడు ఉన్న హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువల ద్వారా నీరు రావాలంటే రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, చిత్తూరు దాటి కుప్పానికి రావాలి. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని గతంలో సీఎంగా ఉన్న వైయస్ జగన్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కడప జిల్లా గండికోట నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ బ్రాంచి కెనాల్‌కు ఒక లింక్ కెనాల్ ఏర్పాటు చేసి సీజనల్ వాటరే కాకుండా, కరువు ఉన్నప్పుడు కూడా గండికోట నుంచి కుప్పానికి నీటిని విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నిజంగా ఈ ప్రాంత వాసులపై తనకు చిత్తశుద్ది ఉంటే, వైయస్ జగన్ గారు చేసిన ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.