పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌ విద్య అవసరం

ప్రస్తుతం విద్య సవాల్‌గా మారింది

అమ్మ ఒడి కార్యక్రమంతో విద్యార్థులకు లబ్ధి

నాడు-నేడు కార్యక్రమం మంచి నిర్ణయం

చంద్రబాబుకు అమరావతి పిచ్చి ఎందుకో?

ఎమ్మెల్యే వరప్రసాద్‌

అసెంబ్లీ: పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌ విద్య అవసరమని ఎమ్మెల్యే వరప్రసాద్‌ పేర్కొన్నారు. అసమానతలు తొలగాలంటే విద్య అవవసరం. తరాల్లో మార్పు రావాలంటే విద్య తప్పనిసరిగా అవసరం. ప్రస్తుతం విద్య సవాల్‌గా మారింది. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌ విద్య అవసరం. అమ్మ ఒడి కార్యక్రమంతో విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. మధ్యాహ్న భోజన మెనూతో విద్యార్థులకు చాలా లాభం.  నాడు-నేడు కార్యక్రమం మంచి నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడారు. చంద్రబాబు ఒక్కసారి కూడా ఒంటరిగా గెలిచినట్లు చూడలేదు. మొదటి సారి ఎన్టీఆర్‌ దయ, రెండోసారి బీజేపీతో పొత్తు, మూడో సారి బీజేపీ, జనసేతతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబులో ఎలాంటి పరిపక్వం లేదు. ప్రజాస్వామ్యంలో పరిపక్వం చాలా అవసరం. చంద్రబాబు ఏమీ నేర్చుకోలేదు. దళితులను ఏమీ అనలేదని చంద్రబాబు చెప్పమనండి. బీసీలను తోక కట్‌ చేస్తామనడం, అంతు చూస్తామని బెదిరించడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఉండి జన్మభూమి కమిటీలు వేశారు. ఇదే ఆయన అపజయానికి నాందీ. చంద్రబాబుకు ధైర్యం లేదు. ఆయన చాలా పిరికి. పిరికివాడు ప్రతి రోజు చనిపోతాడట. చంద్రబాబుకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సద్వినియోగం చేసుకోలేదు. నోటి నిండా అబద్ధాలు, అసమర్ధత, అహంకారం చంద్రబాబుకు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ప్రజాస్వామ్యం తెలిసి ఉంటే సీఎం వైయస్‌ జగన్‌  సంక్షేమ పథకాలను మెచ్చుకునేవారు. చంద్రబాబు తన మేనిఫెస్టోపై ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించినట్లు కానీ, శ్వేతపత్రం విడుదల చేసినట్లు కానీ చూడలేదు. ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ చేయకుండా చట్టాలను చదవాలి. 
అమరావతిలో చంద్రబాబు ఐదేళ్లలో చేయాల్సింది చేసి ఉంటే ఏ సమస్య వచ్చేది కాదు. సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..13 జిల్లాల్లో సమగ్రాభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదు. కరుణానిధి ఉన్న సెక్రటేరియట్‌ సరిపోవడం లేదని పెద్దది కట్టించారు. జయలలిత వచ్చిన తరువాత ఆ సెక్రటేరియట్‌ భవనాన్ని ఆసుపత్రిగా పెట్టుకున్నారు. మళ్లీ కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఏమాత్రం ఆందోళన చేపట్టకుండా మరోకటి ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబుకు అమరావతి పిచ్చి ఎందుకో?. అమరావతి రైతులకు అన్యాయం చేయమని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొంటున్నారు. ఇంగ్లీష్‌ మీడియం అమలుపై మనస్పూర్తిగా సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానని ఎమ్మెల్యే వరప్రసాద్‌ పేర్కొన్నారు. 

Back to Top