సీఎం నిర్ణయాలు రాష్ట్ర చరిత్రను ఉన్నతస్థాయిలో నిలబెడతాయి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌
 

అసెంబ్లీ: మాతృభాషతో పాటు మరో భాష నేర్చుకుంటే పిల్లల్లో సమస్యను పరిష్కారం చేసే శక్తి పెరుగుతుందని సైన్స్, సైకాలజీ పరిశోధన చెబుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ అన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని వేరే వేరే దేశాల్లో లాంగ్వేజీ పాలసీపై రూల్స్‌ తీసుకువస్తున్నారు. ద డైవర్సిటీ ఆఫ్‌ లాంగ్వేజెస్‌ ఇన్‌ ఎర్లీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఎల్‌) ఇది అమెరికా పాలసీ, మల్టీ ఎర్లీ లాంగ్వేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ యూరప్‌లో ఇంప్లిమెంట్‌ జరుగుతుందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ మాట్లాడుతూ.. ప్రైమరీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తే విద్యార్థులు త్వరగా ఇంగ్లిష్‌ నేర్చుకుంటారని సీఎం వైయస్‌ జగన్‌ ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. మొక్కై వంగనిది మానై వంగునా..? విద్యార్థులు చిన్న వయస్సులో ఇంగ్లిష్‌ నేర్చుకుంటే వారికి జీవితాంతం సులభతరం అవుతుంది. ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇంగ్లిష్‌ తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగకూడదా..? ఎవరైతే ఇంగ్లిష్‌ మీడియంను వ్యతిరేకిస్తున్నారో.. వాళ్ల కొడుకులు, కుతుళ్లు, మనవళ్లు ఇంగ్లిష్‌మీడియంలో చదివిస్తూ.. గవర్నమెంట్‌ స్కూల్‌లో చదివే పిల్లలకు అన్యాయం చేస్తున్నారు.

తెలుగు భాష మన సంస్కృతి, మన భావం, మనం ఎలా బతుకుతున్నామనేది చెబుతుందని సీఎం స్పష్టంగా చెప్పారు. తెలుగు మన రక్తంలోనే ఉందని కూడా చెప్పారు. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలి. అమ్మఒడి, నాడు– నేడు, ఇంగ్లిష్‌ మీడియం బోధన ఆంధ్రరాష్ట్ర చరిత్రను ఉన్నత స్థానాల్లో నిలబెడతాయి. ధర్మం, రాజకీయాలు కలిసి నడువలేవు అని నానుడి ఉంది.. కానీ అది తప్పు.. సీఎం వైయస్‌ జగన్‌ ధర్మాన్ని నిలబెడుతూ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

Read Also: చంద్రబాబు మేడిన్‌ మీడియా..వైయస్ జగన్‌ మేడిన్‌ పబ్లిక్‌

తాజా ఫోటోలు

Back to Top