దిశ చట్టం మహిళలకు వజ్రాయుధం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌
 

అసెంబ్లీ: దిశ చట్టం మహిళలకు వజ్రాయుధం.. ఆకాశంలో సగం కాదు..  ఆకాశమంతా మనదే అనే విధంగా యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ మహిళాలోకం సీఎం వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గృహ హింస, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు అరికట్టాలని దిశ చట్టం ద్వారా కఠిన చర్యలు, కఠినమైన శిక్ష, ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు, 21 రోజుల్లో తీర్పు అనే అంశాలతో దిశ చట్టం రూపకల్పన చేసుకుంది. మహిళల్లో అఖండమైన ఆత్మవిశ్వాసం నింపుతూ మహిళలు స్వయంప్రకాశమై ఓ వెలుగు వెలుగుతారు. దిశ చట్టం ద్వారా అత్యాచారాలకు పాల్పడే క్రిమినల్స్‌లో, చెడు చేయాలనే వ్యక్తిలో, పబ్లిక్‌లో మొత్తం సమాజంలో ఒక భయం ప్రతిధ్వనిస్తుందని, ఈ భయం వల్లే సమాజంలో మార్పు వస్తుందని నమ్ముతున్నాను. ఇకపై ఎవరైనా సోషల్‌ మీడియాలో ఫొటో మార్ఫింగ్, ప్రొఫైల్‌ హ్యాకింగ్, రాంగ్‌ మెసేజెస్, అసభ్యకరంగా పెడితే జగనన్న జైల్లోకి తీసేస్తాడు అని క్రిమినల్స్‌లో దడపడుతుంది. ఆంధ్రలో మహిళలంతా ఉక్కు మహిళలుగా తయారై నిర్భయంగా అడుగులు వేయాలి. దిశ చట్టం మహిళల ధైర్యం, దిశ చట్టం మహిళల చైతన్యం, దిశ చట్టం మహిళ సురక్ష, దిశ చట్టం మహిళల ఆత్మబలం, దిశ చట్టం మహిళల భరోసా అని నిర్భయంగా అడుగులు వేస్తాం. దిశ చట్టం చరిత్రాత్మకం, దీనిలో భాగం అయినందుకు గర్వపడుతున్నానని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ అన్నారు.

Read Also: వైయస్‌ జగన్‌ మనసున్న మారాజు

తాజా ఫోటోలు

Back to Top