వైయస్‌ జగన్‌ మనసున్న మారాజు

ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
 

అసెంబ్లీ: మహిళల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మనసున్న మారాజు అని, ఆయన చరిత్రలో నిలిచిపోతారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేర్కొన్నారు. దిశ చట్టంపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. మహిళల భదత్రకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదములు.  ఈ బిల్లు మా అందరికి సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. మనసున్న నాయకుడు వైయస్ఆర్‌ గురించి..ఆయన తనయుడు ఇప్పటి సీఎం అయిన వైయస్‌ జగన్‌ గురించి చెప్పాలనుకుంటున్నాను. గతంలో  మహిళలకు దివంగత నేత వైయస్‌ఆర్‌ అన్నింటి గౌరవించే విధానాన్ని చూశాం. ఇప్పుడు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌  మానవత్వం గల గొప్ప మనిషిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ నీరాజనాలు అందిస్తున్నారు. ఈ ఆరు నెలల పాలనలో అన్నింటి మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు దిశ చట్టం ఏర్పాటు చేయడాన్ని మహిళలు సంతోషంతో స్వాగతిస్తున్నారు. గతంలో మహానేత వైయస్‌ఆర్‌ ఇందిరాగాంధీ పేరుతో భూమిని ఆరు లక్షల మంది పేదలకు పంచి పెట్టారు. అలాగే పావలా వడ్డీకే  రుణాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల పక్కా ఇళ్లు మంజూరు చేశారు. మహానేత తనయుడు వైయస్‌ జగన్‌ కూడా అంతకంటే ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మహిళలకు భద్రత, రక్షణ, గౌరవం విషయంలో రెండింతలు ఎక్కువ అవకాశం కల్పించారు. ఇటువంటి చట్టం రాష్ట్రంలోని ప్రతి మహిళకు గౌరవాన్ని కలిగిస్తుంది. ఈ చట్టంతో పూర్తి రక్షణ లభిస్తుందన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది. గతంలో అనేకమైన భౌతిక దాడులు జరిగాయి. ఇటువంటి కఠినమైన నిర్ణయాన్ని 21 రోజుల్లోనే శిక్షను ఖరారు చేయడం. సోషల్‌ మీడియాలో కూడా తప్పుడు పోస్టులు పెడితే శిక్షలు విధించేందుకు చట్టం చేయడం దేశంలోని ప్రతి మహిళా హర్షిస్తుంది. బతకాలన్న ఆశ చిగురిస్తోంది. గత ప్రభుత్వం మహిళలకు సెల్‌ఫోన్లు ఇస్తామని చెప్పారు. గ్రామీణ గిరిజన ‌ప్రాంతాల్లో ఎక్కడా భద్రత ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింట రక్షణ కల్పించడం, దిశ చట్టాన్ని అందరి మద్దతుతో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. అక్కచెల్లెమ్మలకు 25 లక్షల  ఇళ్ల స్థలాలు ఇస్తూ..వాటికి పట్టాలు కూడా ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రతి మహిళా సంతోషిస్తోంది. ఆర్థికభద్రత కలిగిస్తోంది. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫి చేయబోతున్నారు. చదువుల విప్లవంతో ఎంతో సంతోషిస్తున్నాను. జీరో ఎఫ్‌ఐఆర్‌ కూడా మహిళలకు భద్రత కలిగిస్తోంది.  స్త్రీ ఉన్నతికి ఇది తోడ్పడుతుంది. బాలికలు, మహిళలు, దివ్యాంగుల విషయంలో చట్టాలను సవరించాల్సి ఉంది. మహిలందరి తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. 

Read Also: స‌త్వ‌ర న్యాయం జ‌రిగితే నేరాలను ఆప‌గ‌లం

తాజా ఫోటోలు

Back to Top