వైయస్ జగన్ సంఘ సంస్కర్త

 కఠిన నిర్ణయాలు తీసుకునేది ప్రజల కోసమే

వెనకబడినవర్గాల అభ్యున్నతికి  విప్లవాత్మక మార్పులు

 తెలుగు తల్లిలాంటిది.. ఇంగ్లిష్‌ భార్యలాంటిది

సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు

 

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంఘ సంస్కర్త  అని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన మొదలు పెట్టినప్పటి నుంచి అణగారిన వర్గాలకు కావాల్సిన ఆర్థిక, రాజకీయాల్లో చైతన్యం తీసుకురావడానికి కషి చేస్తున్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విప్లవాత్మక మార్పుల్లోంచి పుట్టిందే ఇంగ్లిష్‌ మాద్యమంలో భోదన అని అన్నారు. పేదరికంతోనే చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నన్ను ఇంగ్లిష్‌ మీడియం చదివించలేక పోయారని చెప్పారు. నాలాంటి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే నాయకుడు రావాలని చిన్నప్పుడే బలంగా కోరుకున్నానని ఆయన తెలిపారు. జగన్‌ తన పిల్లలను ఎలా చదివించారో.. దళితులు, మైనార్టీ, బీసీ వర్గాల పిల్లలు కూడా అలా చదివించాలనే పట్టుదలతోనే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం వల్ల తెలుగుకు వచ్చిన నష్టమేమీ లేదని సుధాకర్‌ బాబు చెప్పారు. ఆంగ్లంతో పాటే లె లుగును కూడా బోధిస్తాని పేర్కొన్నారు. పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం వల్ల పోటీతత్వం అలడుతుందని ముఖ్యమంత్రి జగన్‌ అనేక సార్లు చెప్పారని తెలిపారు. సొంత ఊళ్లలోనే అణగారిన వర్గాల వారికి ఇంగ్లిష్‌ బోధన జరుగుతోంటే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శలు గుప్పించడమేంటని ఆయన ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు, కొన్ని తెలుగు పత్రికలకు ఈ నిర్ణయం వల్ల నిద్ర పట్టడం లేదని విమర్శించారు. గ్రామాల్లో రాజకీయ చైతన్యం వస్తే తమ పని అయిపోతుందనే ఉద్దేశంతోనే లేనిపోని ప్రకటనలు గుప్పిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. 
హైకోర్టును  వేడుకుంటున్నా..
మాలలుగా.. మాదిగలుగా, యానాదులుగా ఈ సమాజంలో అట్టడుగువర్గాల్లో పుట్టిన వారిగా ఇంగ్లిష్‌ మీడియం నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని హైకోర్టును వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని సపోర్ట్‌ చేస్తే న్యాయస్థానాల మీద అణగారిన వర్గాలకు గౌరవం పెరుగుతుందన్నారు. మంచి మార్పు వస్తోంటే.. అడ్డుకుంటున్నందుకు మాలాంటి నిమ్నవర్గాలను బాధిస్తోందని వాపోయారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మా పల్లెల్లోకి వచ్చి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మైనార్టీలు చదువుకోడానికి అవకాశాలు లేక, చదువుకున్న వారికి ఇంగ్లిష్‌ రాక ఇంకా మెకానిక్‌లుగా పని చేస్తున్నారని చెప్పారు. నిమ్నవర్గాల అమయాత్వమే.. చంద్రబాబు నాయడుకు కావాల్సిందని అన్నారు. ఇంగ్లిష్‌  మీడియాన్ని బీసీ, మైనార్టీ ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా సమర్థిస్తున్నామని సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. 

 

Back to Top