నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇద్దామని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. పార్లమెంట్‌కు పేదవాడిని, సామాన్యుడిని పంపే దమ్ము ఒక్క వైయస్ జగన్‌కు మాత్రమే ఉందని, బాపట్ల పార్లమెంట్ నుంచి నందిగం సురేష్‌ను పంపారు, ఇప్పుడు గురుమూర్తిని పంపుతున్నారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు దయచేసి ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నెల్లూరులోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. మేం చేసిన పనులను ప్రతీ గడప దగ్గరకు వెళ్ళి చెప్పాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీ, బీజేపీ చేస్తున్న ప్రకటనలు, ఆ పార్టీ నేతల ప్రసంగాలు అత్యంత చవకబారుగా ఉన్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించినా, తాము అధికారంలో ఉండగా చేసిన పనులు చెప్పకుండా, ఈ ప్రభుత్వాన్ని, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, మేం చేసిన పనులను ప్రతీ గడప దగ్గరకు వెళ్ళి చెప్పాం. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు.. టీడీపీ నేతలు సిగ్గులేకుండా దారిదోపిడీ దొంగల్లా, దొంగల ముఠాల్లా గత 5 ఏళ్ళూ రాష్ట్రాన్ని దోచుకుతిని, ఇప్పుడు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు అనేక సంక్షేమ పథకాలను అమలుచేయడమే కాకుండా, దళారీలకు తావు లేకుండా, ఒక బటన్ నొక్కితే నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లలో డబ్బులు పడ్డాయి, దీనివల్ల అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ లబ్దిపొందారు. కానీ టీడీపీ, బీజేపీలు అనేక హమీలిచ్చి ఏ ఒక్కటి అమలుచేయకుండా, సిగ్గులేకుండా ఈరోజు మళ్ళీ ఓట్లు అడుగుతున్నాయి. అసలు ఆ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కే లేదు. విభజన హమీలు పక్కనబెట్టి బీజేపీ నేతలు సొల్లు కబుర్లు చెబుతున్నారు. మీదీ ఒక బతుకేనా..? వివేకానందరెడ్డి గారి హత్య గురించి ప్రస్తావిస్తూ, మానవత్వం లేకుండా చంద్రబాబు, లోకేష్ పదే పదే మాట్లాడుతున్నారు, మీదీ ఒక బతుకేనా..?, మీకు దమ్ముంటే, ఖలేజా ఉంటే మీరు ఏం చేశారో ప్రజల్లోకి వెళ్ళి అడుగుదాం రండి, మీరు ఏం చేశారో, మేం ఏం చేశామో ప్రజల్లోకి వెళదాం రండి, కానీ చేతకాక, డిపాజిట్లు రావని తెలిసి వివేకానందరెడ్డి గారి హత్య కేసుపై మాట్లాడుతున్నారు. ఇంకా వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గురుమూర్తి హిందువా లేక క్రిస్టియనా అని బుద్దీ, జ్ఞానం లేకుండా మత రాజకీయాలు చేస్తూ, చేతగాని చవట దద్దమ్మల్లా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. గత 5 ఏళ్ళూ టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని పాలించి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు సిగ్గులేకుండా ప్రత్యేకహోదా గురించి విమర్శలు చేస్తున్నారు. ఆరోజు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చారని, నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడుని ఊరు వాడా టీడీపీ నేతలు సన్మానాలు చేయలేదా, ఇప్పుడు మళ్ళీ డ్రామాలా..? అందుకే మేం బీజేపీ నేతలను అడుగుతున్నాం, మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, విభజన హమీలు అమలుచేస్తారా లేక ప్రత్యేకహోదా ఇస్తారా, లేదా చెప్పండి. ఓటు హక్కును సద్వినియోగం చేససుకోండి .. మేం ఏం చేశామో చెప్తున్నాం, ఏం చేయబోతున్నామో చెప్తున్నాం, మా నాయకుడు ఒక మాట చెప్పాడంటే ఆమాట కోసం ఎందాకైనా వెళతారు. ఒక పేదవాడిని, ఒక మంచి వాడిని, ఒక డాక్టర్ అయిన గురుమూర్తిని మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాం, కానీ టీడీపీ అభ్యర్ది, బీజేపీ అభ్యర్ధి చిట్టా చూద్దామా..? పార్లమెంట్‌కు పేదవాడిని, సామాన్యుడిని పంపే దమ్ము ఒక్క వైఎస్ జగన్‌కు మాత్రమే ఉంది, బాపట్ల పార్లమెంట్ నుంచి నందిగం సురేష్‌ను పంపారు, ఇప్పుడు గురుమూర్తిని పంపుదాం, దయచేసి ఓటును సద్వినియోగం చేసుకుందాం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భారీ విజయాన్నిముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికి బహుమతిగా ఇద్దాం. సిగ్గు లేకుండా మాపై విమర్శలా..? అచ్చెన్నాయుడు టీడీపీ ఖాళీ అయిందంటాడు, లోకేష్ వల్లే పార్టీ నాశనం అయిపోయిందని మాట్లాడాడు, మంగళగిరి పేరు కూడా పలకలేని లోకేష్ టీడీపీ స్టార్ క్యాంపెయినర్ అట.., లోకేష్ బ్యాక్‌డోర్ పోలిటీషియన్, తండ్రి హయాంలో అడ్డంగా దోచుకున్న లోకేష్ కూడా విమర్శలు చేయడమా, చంద్రబాబు కొడుకు హోదా తప్ప ఏం ఉంది లోకేష్‌కు. లోకేష్ గురించి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చెప్పాక, ఇంకా సిగ్గు లేకుండా మాపై విమర్శలా..? తిరుపతి ప్రజలు తిరుగులేని మెజార్టీతో గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరింత అభివృద్ది, సంక్షేమం కొనసాగించి తిరుపతి ప్రజల రుణం తీర్చుకుంటామని సుధాకర్‌బాబు పేర్కొన్నారు.