ప్రతి గడపకు సంక్షేమం అందింది 

ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి

గడపగడపకు బ్రహ్మరథం పట్టిన కాలనీవాసులు

శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. మడ‌క‌శిర మునిసిపాలిటీ పరిధిలోని  7 వ వార్డ్  న్యూ ఎస్సీ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీ వాసులు ఎమ్మెల్యే తిప్పేస్వామి కి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే ప్రజలను అడగగా  ఈ ప్రభుత్వంలో ఎవరి సిఫార్సులు లేకుండానే సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పతకమైనా,పెన్షన్ మంజూరైనా సచివాలయంలో తక్షణమే చేసి పెడుతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. కాలనీ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని దాని పరిష్కారానికి తక్షణమే అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాయని వీటిని చూసే ప్రజలు మళ్లీ వైయ‌స్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే ఏర్పాటు చేసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చిండ౦లో సఫలీకృతం అయిందన్నారు.  కార్యక్రమంలో స్టేట్ కార్పోరేషన్ డైరక్టర్ రామకృష్ణ, సింగిల్విండో అధ్యక్షులు రామిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ జయరాజ్ , వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి  , వైస్ వెంకటలక్ష్మమ్మ, కౌన్సిలర్లు ఆన్సరఖాన్, నాగేంద్ర,  విక్రమ్, మేఘన రమేష్, సిద్దప్ప, అంజన్, లక్ష్మయ్య, బలరాం,   సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

పత్తికొండ మండలం దూదేకొండ గ్రామంలో ఘ‌న స్వాగ‌తం
ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోని దూదేకొండ గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ‌దేవి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎమ్మెల్యేకు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్ళి  కంగాటి శ్రీదేవమ్మ వివరించారు. కార్యక్రమం అనంతరం గ్రామ సచివాలయంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తో  స‌మావేశం ఏర్పాటు చేసి గ్రామ స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.   కార్యక్రమంలో సర్పంచ్ ముజ్జుబుర్ రెహ్మాన్, నరసింహ ఆచారి, నరసింహులు, బోయ కోడం పెద్ద ఆంజనేయ, బాలు, వార్డ్ మెంబర్ రంగన్న, బూరుకుల చిన్న ఆంజనేయ, నేమకంటి రామంజినేయులు, పీర, హరిజన పెద్దయ్య, హరిజన సుంకన్న, హరిజన లక్ష్మయ్య పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top