ఆర్థికాభివృద్ధితోనే దళిత వర్గాలకు న్యాయం

ఎమ్మెల్యే తిప్పేస్వామి
 

అసెంబ్లీ: ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజించేందుకు చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరం. ఇంత ప్రాధాన్యత కలిగిన  బిల్లు సభలో ప్రవేశపెట్టి చర్చ జరుతుంటే ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం బాధాకరం. ఎస్సీ, ఎస్టీలు బాగా వెనుకబడ్డారని రాజ్యాంగంలోని 338 ఆర్టికల్లో చాలా స్పష్టంగా చెప్పారు.  స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లు అయినా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి జరగలేదని కేంద్రం గుర్తించి 1990లోని 68వ రాజ్యంగ సవరణ చేసి ఎస్సీ, ఎస్టీ  కమిషన్‌ తెచ్చింది. దేశంలో ఉండే దళితులు, గిరిజనుల అభివృద్ధి జరగాలన్నదే ఈ కమిషన్‌ ఉద్దేశం. ఆ తరువాత కూడా వాళ్ల స్థితి గతులు ఆశించినంతగా మార్పు జరగలేదు. 2003లో 89వ సవరణ చేసి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లుగా విడగొట్టారు. మన రాష్ట్రంలో 2003లో స్టేట్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ఏ ర్పాటు చేశారు. అయినా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు వారి గురించి ఆలోచన చేయలేదు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ కమిషన్లు విభజించి ఇంకొంచం వేగంగా అభివృద్ధికి బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరం. ఇంత మంచి బిల్లు సభలో వస్తే ప్రతిపక్ష సభ్యులు లేకపోవడం సరికాదు. రాజ్యాంగంలో ఈ వర్గాలకు అనేక సదుపాయాలు కల్పించింది. పదేళ్లు రిజర్వేషన్లు మనస్ఫూర్తిగా ఇవ్వండని అంబేద్కర్‌ ఆ రోజు స్పష్టంగా చెప్పినా కూడా అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదు.  మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటి రోజే వైయస్‌ జగన్‌ దళిత వర్గాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడం, డిప్యూటీ మంత్రులు, హోం మంత్రులను నియమించడం ఇదో చరిత్ర. మంత్రిత్వ శాఖలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం. ప్రతి దాంట్లో కూడా 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం గొప్ప విషయం. నామినేటేడ్‌ పనులు, పదవుల్లో రిజర్వేషన్లు కావాలని చాలా రోజులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోరారు. ఈ ప్రభుత్వం మాత్రమే అలాంటి చట్టం చేసింది. పక్కా గృహాలు, పింఛన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ అందుతోంది. విద్యా, ఆరోగ్యం ఈ ప్రభుత్వం అందిస్తోంది. ఈ ప్రభుత్వంపై దళితులకు కాన్ఫిడెంట్‌ కలుగుతోంది. చాలా గ్రామాల్లో దళితులకు ఆలయ ప్రవేశం లేదు. ఇటీవల ఎమ్మెల్యేను అవమానించారు. కర్ణాటక బార్డర్‌లో ఓ ఎంపిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. కుల వివక్షను రూపుమాపాలి. ఆర్థికాభివృద్ధి జరిగిన్నప్పుడే దళిత వర్గాలు బాగుపడుతాయి. ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
 

Back to Top