అనంతపురం: పెరూరు డ్యామ్‌కు నీరిచ్చిన సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల శంకుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 2007లో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి ఈ ప్రాంత ప్రజల సమస్యలపై వినతిపత్రం ఇచ్చాం. 2009లో రాప్తాడు బహిరంగ సభలో పేరూరు డ్యాంకు నీరిస్తామని హామీ ఇచ్చారు. మహానేత మరణం తరువాత ఎవరూ పట్టించుకోలేదు. పేరూరు డ్యాంకు నీరిచ్చిన మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఒక రిజర్వాయర్‌ను మూడు రిజర్వాయర్లు చేశారు. 25 ఎకరాలను 75 ఎకరాల ఆయకట్టుగా మార్చుతున్నారు. ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు మాట నిలబెట్టుకున్నారు. మా నియోజకవర్గ ప్రజలు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. వలసలు పోతున్న లక్షలాది కుటుంబాలు గత 15 ఏళ్లుగా బెంగుళూరు, హైదరాబాద్‌కు వెళ్లి దుర్భర జీవితాలు గడుపుతున్నారు. భిక్షాటన చేస్తే..గత ప్రభుత్వం హేళనగా మాట్లాడారు. మీరు వచ్చిన తరువాత అమ్మ ఒడి, వైయస్ఆర్ చేయూత, పింఛన్ కానుక, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు చూసి వలస వెళ్లిన వారంతా కూడా వెనక్కి వస్తున్నారు. వలస వెళ్లిన వారికి తిరిగి రప్పిస్తూ..వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని ఎమ్మెల్యే కోరారు. రాప్తాడు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరిస్తున్నారు. రాముడి వద్ద లక్ష్మణుడి మాదిరిగా మీ వెంటే జీవితాంతం ఉంటాం. మహానేత ఆశయాల కోసం మేం కూడా పని చేస్తామని, వైయస్ భారతక్క కు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.