తూర్పు గోదావరి జిల్లా: మాట ఇస్తే నిలబెట్టుకోవడం, చేస్తానంటే చేసి చూపుతారు..దటీజ్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అనపర్తి ఎమ్మెల్యే సూర్య నారాయణ అన్నారు. పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన వైయస్ జగన్ ..ఆ రోజు అక్రమ కేసులు ఎత్తివేస్తానని మాట ఇచ్చి..ఇవాళ నెరవేర్చారని తెలిపారు. బిక్కవోలు మండలం బలభద్రాపురంలో రూ.2,700 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసి గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఈ రోజు రూ.2,700 కోట్ల ప్రాజెక్ట్‌ను మా నియోజకవర్గంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఆదిత్య గ్రూప్ చైర్మన్ మంగళం బిర్లాకు వందనాలు. గతంలో ఇక్కడ థర్మల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆ రోజు పాదయాత్రలో ఇక్కడికి వచ్చిన వైయస్ జగన్ పరిశ్రమలపై హామీ ఇచ్చారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలే అనుమతిస్తామని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గ్రాసీమ్ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చారు. నీటి శుద్ధితో గ్రాండ్ వాటర్ కూడా పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. గతంలో టీడీపీ నేతల తీరు చూశాం. ఆ రోజు అమాయకులపై అక్రమ కేసులు పెట్టారు. ఒక్క కేసు ఎత్తేయలేదు. ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేస్తామన్నారు. అవేవి చేయలేదు. ఈ రోజు వైయస్ జగన్ రూల్స్‌ను కఠినతరం చేశారు. అక్రమ కేసులన్నీ కూడా సీఎం వైయస్ జగన్ ఎత్తేశారు. సీఎం వైయస్ జగన్ పరిశ్రమ యాజమన్యానికి ఇదివరకే చెప్పారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే..75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని మేం చట్టం చేశామని, ఆ మేరకు ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యానికి చెప్పడంతో వారు అంగీకరించారు. రాబోయే రోజుల్లో యాజమాన్యం సీఎంకు ఇచ్చిన మాట ప్రకారం స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. అనపర్తి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. సీఎస్‌ఆర్ నిధులు ఎక్కువగా ఖర్చు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం వైయస్ జగన్‌కు కొన్ని వినతులు.. నియోజకవర్గంలో 13 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇంకా 6 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. అందరికి ఇవ్వాలని కోరారు. 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు రోడ్డు కనెక్టవిటి ఏర్పాటు చేయాలి. కెనాల్ రోడ్డును పునర్ నిర్మించాలని సీఎం ను కోరారు. అనపర్తి చుట్టు ప్రక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో 100 పడకల ఆసుపత్రికి మంజూరు చేసి దాన్ని 30 పడకలకు కుదించారు. దీన్ని వంద పడకలకు పెంచాలని కోరారు. పెద్దపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని సీఎం వైయస్ జగన్‌ను ఎమ్మెల్యే సూర్యనారాయణ కోరారు. సదా సీఎం వైయస్ జగన్ సేవలో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.