ఇవాళ్టి నుంచి నీ పేరు లోఫర్ లోకేష్ 

శ్రీ‌శైలం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి 

నేను చీటింగ్ మనిషి అయితే ఒకసారి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి,  రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు?

సొంత ఊర్లో వార్డు మెంబర్లు కూడా గెలిపించుకోలేని బుడ్డా చెప్పింది విని నీవు అబద్ధాలుతో స్టేట్మెంట్ ఇస్తావా...?

నంద్యాల‌:  ఇవాళ్టి నుంచి నారా లోకేష్ పేరు లోఫ‌ర్ లోకేష్ అని శ్రీ‌శైలం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి నామ‌క‌ర‌ణం చేశారు. నాకు చీటింగ్ చక్రపాణి ..  పేరు పెట్టానన్నావ్..చాలా సంతోషం.  మీ చీటింగ్ స్కూల్లో 6 ఏళ్ల పాటు చదువుకున్న...నేను చీటింగ్ మనిషి అయితే ఒకసారి జిల్లా అధ్యక్ష పదవి,  రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.  ఎవరిని చీట్ చేసి.. నా సొంత పని చేసుకున్నానో రుజువు చెయ్.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని స‌వాల్ విసిరారు. నారా లోకేష్ విమ‌ర్శ‌ల‌ను ఆదివారం చ‌క్ర‌పాణిరెడ్డి తీవ్రంగా ఖండించారు. 

ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మీడియాతో ఏమ‌న్నారంటే..

 శ్రీశైలంలో ఉద్యోగాలు 
 ఎవరో రాజశేఖర్ అనే వ్యక్తి టెండర్ వేసుకుని ఔట్సోర్సింగ్ ఏజెన్సీ దక్కించుకున్నాడు. నాకేం సంబంధం ఉంది.?
 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి ఔట్సోర్సింగ్ఏజెన్సీ ఇచ్చారు. అందులో నీకు కూడా సంబంధం ఉందా..?
 అప్పుడు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నా చొరవతో పదివేల రూపాయలు పైగా పెరిగింది.

 నేను దేవుడి సొమ్ము తినేవాడినా? 

 మా సొంత డబ్బులతో మహానంది తో పాటు ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం.
 శ్రీశైలం కు నా బంధువులు వచ్చిన టికెట్లు కొని పంపిస్తా.
 అంతెందుకు మీ పార్టీ నేత అచ్చం నాయుడు దర్శనం కోసం నాకు కాల్ చేస్తే నేనే టికెట్లు కొని పంపించా అడిగి తెలుసుకో లోఫర్ లోకేష్..
 తన వాళ్లందరికీ దౌర్జన్యంగా దర్శనాలు ఇప్పించుకునే బుడ్డా నీ దగ్గరే ఉన్నాడు అతనికి బుద్ధి చెప్పుకో

 కృష్ణాపురంలో ఎవరో పుల్లారెడ్డి దేవుని మాన్యం కబ్జా చేశాడు అంటున్నావు నాకు సంబంధం ఏముంది.? నీవు లాగేసుకో నాకేం అభ్యంతరం లేదు.

 సున్నిపెంట భూ కబ్జాలు 
 వెంకట్ రెడ్డి , గుండయ్య లు చెరో పది ఎకరాలు ఇరిగేషన్ భూమి ఆక్రమించారు అంటున్నావు...నేను ఎమ్మెల్యే అయ్యాక ఎవరిని సెంటు భూమి ఆక్యుపై చేయనీయలేదు.
 మీ ప్రభుత్వ హయాంలో జరిగిందేమో చేతనైతే లాక్కో..

 ఆత్మకూరు లో అంజద్ బాషా 10 ఎకరాలు  సెయింట్ భూమి కబ్జా చేసాడు అన్నావు ఆధారాలు ఉంటే రుజువు చెయ్ చట్టం ముందు నిలబెట్టు.

 మహానంది మండలంలో అంకిరెడ్డి చెరువు నుంచి మధుసూదన్ రెడ్డి ఎర్రమట్టి తోలుతున్నాడు అంటున్నావు.
 టిడిపి హాయంలో జరిగి ఉంటే నాకేం సంబంధం..?
 మామ కోడళ్ళు అయిన బుడ్డా అఖిలప్రియలు సంయుక్తంగా కలిసి చేశారు.
 అఖిల ప్రియ తన పైలెట్లను పెట్టించి మట్టి తరలించింది.
 లోఫర్ లోకేష్.

 ఆత్మకూరులో రూ.116 కోట్లు అమృత్ స్కీం..
 పర్సెంటేజీల కోసం పనులు డిలే చేయించినది మీ బుడ్డా కాదా?
 నేను వచ్చాకే పనులు పూర్తి చేయించా.
కావాలంటే టౌన్ లోకి వెళ్లి చూడు నీళ్ల ట్యాంకులు కనిపిస్తాయి.
 సొంత ఊర్లో వార్డు మెంబర్లు కూడా గెలిపించుకోలేని బుడ్డా చెప్పింది విని నీవు అబద్ధాలుతో స్టేట్మెంట్ ఇస్తావా... లోఫర్ లోకేష్..

 2014లో మీ నాయన హయాంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు.
 రైతు రుణాలు మొత్తం మాఫి అన్నాడు.. పొదుపు లక్ష్మీ రుణాలు మాఫీ అన్నాడు...ఇంటికో ఉద్యోగం అన్నాడు... నిరుద్యోగ భృతి అన్నాడు. బాబోస్తే జాబువస్తుంది అన్నాడు..
 మీ నాయన  కూసిన కూతలన్నీ విని మేం జనాల్లోకి వెల్లి ఉంటే జనాలతో తన్నులు తినేవాళ్ళం 

 2019లో నేను ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరుస్తున్నాను.
.
 సున్నిపెంటను పంచాయతీ చేస్తా అన్నాను...చేశానుకో

 ఆత్మకూరుకు దాహార్తి తీరుస్తా అన్నాను.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.
 11 కోట్ల రూపాయలతో సున్నిపెంటకు మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయించాను.

 మీ నాయన సీఎం అవగానే కర్నూల్ లో మీటింగ్ పెట్టి ఆలూరులో జింకల పార్కు తంగడించలో సీడ్ పార్కు,
రోళ్లపాడు లో పక్షుల పార్కు నల్లమలలో పులుల పార్క్ అని హామీ ఇచ్చాడు.
 అక్కడ పులులు లేవు గాని మానవ మృగాలైన పులులను నీ చుట్టూ తిప్పుకుంటున్నవ్.

 వసూల్ రాజా అంటే ఎవరో తెలుసా...? 
బుడ్డా గురించి తెలుసుకో 

 టిడిపిలోకి కప్పదాటు వేశాక బుడ్డా ఎమ్మెల్యేగా  ఎంత దోచుకున్నాడో మీ కార్యకర్తలనే అడుగు చెబుతారు.
 ఎర్ర మట్టి దందాలు చేసింది ఎవరో ఆ వసూల్ రాజా ఎవరో తెలుసుకో..
 నీరు చెట్టు కింద ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా 100 ల కోట్లు నొక్కేశారు.
 ఒక చెట్టును చూపించండి.

 1983 నుంచి మీ ఆస్తులు ఎలా పెరిగాయి.. లోఫర్ లోకేష్..?
నువ్వు, మీ నాయన.. ఎన్ని సెనగలు  ధనియాలు పండించి అమ్మినారు?
 ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..?

  మీ యాత్ర పై క్లారిటీ ఉందా..? 
 నీ యాత్రలో ఇదేం ఖర్మరా అని నినాదం ఇస్తున్నారు. ఇది కరెక్టే.
 అసలు క్లారిటీ లేని యాత్ర పెట్టి కార్యకర్తలను సతాయిస్తున్నారంట *మాకు ఇదేం కర్మరా* అని వాళ్ళు తిట్టుకుంటున్నారంట.

 ఎవరిని ఏం మాట్లాడాలో నీకు మీ నాన్న నేర్పలేదా..? 
 మిస్టర్ లోఫర్ లోకేష్ ఎవరిని ఏం మాట్లాడాలో తెలీదా..?
అందుకే నిన్ను వలబనేని నాని అంత పచ్చిగా తిట్టేది.
 నీ చేష్టల వల్ల కడుపు మండేనోళ్లు తిడతారు ...
  మళ్లీ మీ నాయన బావురుమని ఏడుస్తాడు.. 
 నీవు పప్పు కాదు నీ ఒక తుప్పు అని ఇప్పుడు నీ వాళ్ళకి తెలిసిపోయింది.
 తెలుగు గంగ దగ్గర ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టించింది ఎవరు?
 నేను కమిషన్ తీసుకునే వాడినైతే ఎంత డబ్బు తీసుకొని నాకు జిల్లా అధ్యక్ష పదవి, రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు?
 నేను చీటింగ్ చక్రపాణి అయితే నువ్వు ఇచ్చిన పదవి రాజీనామా చేసి ఎందుకు వెళ్తాను?
 శ్రీశైలం దేవస్థానానికి మీ నాన్నని అడిగి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని వేయించి డెవలప్ చేయించా.

 శ్రీశైలంకి ఏరోడ్రోమ్ అడిగింది నేను

 శ్రీశైలం కు రింగురోడ్ ప్రపోజల్ చేయించింది నేను మరి శ్రీశైలం రింగ్ రోడ్ కి ఎంత కమిషన్ తీసుకున్నావు?
 మహానంది నుంచి ఆత్మకూరు వరకు మీ హయాంలో రోడ్లు ఎలా ఉన్నాయి?
 ఇవాళ నేను ఎమ్మెల్యే అయ్యాక వేయించిన రోడ్డు ఇది.
 పాదయాత్రలో నీ పాదాలకు మట్టి అంటకుండా వెళ్తున్నాంవ్ అంటే అది ఎమ్మెల్యేగా నేను చేసిన కృషి.

 ఆత్మకూరు టౌన్ లో మంచినీళ్ల సమస్య ఎవరి హయాంలో తీరింది?
 సున్నిపెంటను గ్రామపంచాయతీ చేసింది ఎవరు? ఇల్ల పట్టాలు ఇప్పించింది ఎవరు? ఏడు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి నీళ్లు ఇస్తున్నది ఎవరు?
 శ్రీశైలంలో దుకాణాలకు ఎవరి హయాంలో పర్మిషన్ ఇప్పించారు? ఇప్పుడు షాప్స్ allot చేయించింది ఎవరు?
 మహానంది దేవస్థానం సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నది ఎవరు?
 మీరు గెలవని 23 మంది ఎమ్మెల్యేలను కొని చీటింగ్ చేసింది ఎవరు?
 చక్రపాణి రెడ్డి అంటే ఒక క్లారిటీ,  కమిట్మెంట్,  డేడికేషన్  అచీవ్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్
 లోకేష్ అంటే ఒక లోఫర్ డాఫర్. క్లారిటీ లేని పాదయాత్ర చేస్తున్న ఒక పప్పు
 2024 ఎలక్షన్స్ లో ఈ పప్పుకి వదిలిస్తాం తుప్పు.

 చక్రపాణి రెడ్డి గురించి తెలుసుకోవాలంటే వెళ్లి మీ నాయనను అడుగు చెబుతాడు
.
 నేను లోకేష్ కి ఇవాళ ఒక పేరు పెడుతున్న... అది లోఫర్ లోకేష్.

 వెలుగోడు మండలంలోని వెలుగోడు, అబ్దుల్లాపురం రైతులకు 20 లక్షల సొంత ఖర్చుతో సాగునీరు పంపిణీ చేయించా

 ముస్లిం మైనార్టీ లీడర్లను చంపించే సంప్రదాయాo మీ బుడ్డాది.
 ఆత్మకూరులో హిందూ స్మశాన వాటికకు నాలుగు ఎకరాల స్థలం ఇప్పించింది ఎవరు?
మిస్టర్ లోఫర్ లోకేష్... నువ్వు ఇవాళ చేసే యువగలం 2014 నుంచి 2019 వరకు ఏమైంది?
 యువకులను పట్టించుకోకుండా ఇవాళ యువగళం అంటున్నావు. ఇది యువ గళం కాదు వెధవలం అని పేరు పెట్టి చెయ్.
 ఎందుకంటే నువ్వు యువకులను వెధవలను చేసి మోసం చేయడానికి పదవి కోసం చేస్తున్న పాదవ్యధ యాత్ర ఇది.
 
 వర్థన్ బ్యాంకు పెట్టి నూరుకోట్లు మోసం చేశాను అన్నావు నిరూపించగలవా? 
 ఆ బ్యాంక్ కార్యాలయ ప్రారంభానికి పిలిస్తే వెళ్లా...
రుణాలు తీసుకోండి అని చెప్పినాను అంతే గాని, డిపాజిట్లు చేయమని చెప్పినానా..?
మొత్తం వసూళ్లు 2 కోట్లే అని ఎస్పీ నే స్టేట్మెంట్ ఇచ్చాడు.

 కృషి బ్యాంకు, తెహల్గి కుంభకోణాల  సంగతి తేల్చు... 

 వర్ధన్ బ్యాంకు తో నాకు సంబంధం ఉంటే, వేల కోట్లు ముంచేసిన కృషి బ్యాంకుకు తెహెల్గీ స్టాంప్ కుంభకోణాలతో ...  మీ నాయనకు కూడా సంబంధం ఉన్నట్టే కదా..?

 నా క్యారెక్టర్ ఏంటో మీ నాయనని అడుగు 
 మీ నాయన చంద్రబాబును అడిగితే నా క్యారెక్టర్ ఏంటో చెబుతాడు. పత్తికొండలో ఆనాటి డిప్యూటీ సీఎంను పక్కనపెట్టి బస్సులోకి నన్ను పిలిపించుకున్నాడు.
 జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు భేరసారాలు జరపమని నన్ను ప్రోత్సహించలేదా..?

 రాష్ట్రంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ నాయన సంతలో పశువుల్లాగా బేరమాడి కొనలేదా?
 ఇప్పుడు నీ పక్కనే ఉన్న బుడ్డా రాజశేఖర్ ని 18 లక్షలు పెట్టి కొన్నది వాస్తవం కాదా.? 
 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఖర్చు మొత్తం పార్టీయే పెడుతుంది అని చెప్పి నన్ను రంగంలోకి దించి ముంచేసావ్.
 దీనికి సాక్ష్యం మీ అచ్చెన్నాయుడే.

  ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ఎవరు చీటింగ్ చేస్తున్నారో తేల్చుకుందామంటే నేను సిద్ధం.. *ఇద్దరం మహానంది కోనేరులో మునిగి ప్రమాణం చేద్దాం రా* ....

 నేను టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు... జగన్ లక్ష కోట్ల దొంగ అంటూ ప్రచారం చేయమన్నాడు

" రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు కదా అలా చెప్తే ఏం బాగుంటుంది..?"  అని నేను అడిగితే..
"పదే పదే ప్రచారం చేస్తే అదే నిజమని జనాలు నమ్ముతారు.." అంటూ మాకు ఊదర కొట్టేవాడు.

 ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనేటువంటి లోఫర్ బుద్ధి ఎవరిది?
 అందుకే నేను నీకు పేరు పెడుతున్న.. ఇవాల్టి నుంచి నీ పేరు లోఫర్ లోకేష్ 
 ఇకపై నీవు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నిన్ను లోఫర్ లోకేష్ అనే పిలుస్తారు. నీకు ఇది నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ 
 

Back to Top