మంగళగిరిః ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే ఆర్కే రోజా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సంస్థ కార్యాలయంలో అధికారులు,అభిమానులు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల పక్షపాతి అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదన్నారు.పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాలుగా సహకారాలు అందిస్తామని తెలిపారు.పారిశ్రామికరణకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారన్నారు.అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగానికి కృషి చేస్తామని తెలిపారు.స్థానిక పరిశ్రమల్లో యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.పారదర్శకంగా ఏపీఐఐసీ ద్వారా భూముల కేటాయిస్తామని తెలిపారు.వైయస్ జగన్ మహిళలకు ఒక అన్నగా అండగా ఉన్నారని తెలిపారు.