ఎమ్మెల్యే రోజాను పరామర్శించిన సీఎం వైయస్‌ జగన్‌

ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇటీవల చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో రెండు మేజర్‌ సర్జరీలు చేయించుకున్న ఎమ్మెల్యే రోజా.. ఐదు రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 

Back to Top