చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే ..  

  ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

 నగరి : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయకుండా చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితమయ్యారని వైఎస్సార్‌పీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండకపోవడమే కాకుండా.. సేవ చేసే ధృక్పథంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్న తన లాంటి ఎమ్మెల్యేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో వాలంటరీ వ్యవస్థను సీఎం జగన్‌  ఏర్పాటు చేశారని ప్రశంసించారు. సీఎం జగన్‌ పాలనలో ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు. మంచి చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్‌ పని చేస్తుంటే.. తమ మనుగడ కోసం ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబులా పబ్లిసిటీ పిచ్చి సీఎం జగన్‌కు లేదన్నారు. చంద్రబాబు అనుభవం దోచుకోవడానికే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు కాదని విమర్శించారు.
  
 

తాజా వీడియోలు

Back to Top