జ్యూడిషియల్‌ కమిషన్‌ బిల్లుతో అవినీతికి చెక్‌

ప్రతి పైసా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలి

ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

అమరావతి: జ్యూడిషియల్‌ కమిషన్‌ బిల్లుతో అవినీతికి చెక్‌ పెట్టవచ్చు అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. జ్యూడిషియల్‌ కమిషన్‌ బిల్లుకు ఎమ్మెల్యే మద్దతిచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి సభలో మాట్లాడారు. అవినీతిపై పోరాటంలో వైయస్‌ జగన్‌ సర్కార్‌ చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు. అక్రమాలను పూర్తి స్థాయిలో నిరోధించే జ్యూడిషియల్‌ కమిషన్‌. ఏ టెండర్‌ విలువ కూడా రూ.100 కోట్లు దాటినా కమిషన్‌ పరి«ధిలోకి వస్తుందన్నారు. 
అందరికీ అవకాశం ఇవ్వడం వల్ల భారీగా వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు. ఎంత ప్రజాధనం ఆదా అయిందో ప్రజల ముందుకు వివరాలు తెలియజేస్తామన్నారు. ప్రజాధనం మిగిలేలా సూచనలు చేసిన అధికారులకు సన్మానం చేస్తామన్నారు. 
మనం ఉంటున్న బిల్డింగ్‌లకు సంబంధించి ఇద్దరే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారని చెప్పారు. మామూలుగా అయితే రూ.1500 నుంచి రూ.2 వేలకు ఒక అడుగు నిర్మిస్తారన్నారు. కాగ్‌ అక్షితలు వేశారనో, పీఏసీ కమిటీ నిర్ధారించిందని చెప్పుకునే వారం. ఈ కమిషన్‌ ఏర్పాటు చేయడంతో ప్రజలకు అవినీతిరహిత రాష్ట్రంగా రూపొందించవచ్చు అన్నారు. ప్రతి పైసా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూ.90 వేల కోట్లు ఉన్న రాష్ట్రాన్ని రూ.2 లక్షల కోట్లకు చంద్రబాబు అప్పులు పెంచారని విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. ప్రజలందరికీ ఉపయోగపడే ఈ బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు. 
 

Back to Top