కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు 

ప్రొద్దుటూరు: వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన పెద్ద కుమార్తె పల్లవికి ఆదర్శ వివాహం చేశారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కుమార్తె పల్లవి, కమ్మర లీలా గోపి పవన్‌కుమార్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు అయిప్పటికీ వారి పెళ్లికి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పలేదు.

ఆయనే స్వయంగా పల్లవి, పవన్‌కుమార్‌లను గురువారం స్థానిక బొల్లవరంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువెళ్లి సంప్రదాయ ప్రకారం పెళ్లి చేశారు. అనంతరం సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో వారికి రిజిష్టర్‌ మ్యారేజీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. తన కుమార్తె ఎంబీఏ చదివేటప్పుడు పవన్‌కుమార్‌ను ప్రేమించిందని తెలిపారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం మనస్ఫూ ర్తిగా ప్రేమ వివాహం చేశానని చెప్పారు. పవన్‌కుమార్‌ తండ్రి ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారని, ఇష్టపడిన అబ్బాయితో కుమార్తె వివాహం చేశానన్న తృప్తి తనకు ఉందని వివరించారు. వాస్తవానికి ఈ వివాహాన్ని ఘనంగా చేయాలని భావించానని, అయితే తన కు మార్తె ఇందుకు అంగీకరించకపోవడంతో నిరాడంబరంగా జరిపించానని ఎమ్మెల్యే చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top