మ‌త్స్య‌కారుల కుటుంబాల‌కు ఎమ్మెల్యే పేర్ని నాని ప‌రామ‌ర్శ‌

మ‌చిలీప‌ట్నం: మచిలీపట్నం క్యాంప్ బెల్ పేట గ్రామానికి చెందిన మత్యకారులు ఐదు రోజుల క్రితం అంతర్వేది సముద్రం లోకి వేటకు వెళ్లి గ‌ల్లంత‌య్యారు. కుటుంబ స‌భ్యుల‌ను బుధ‌వారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ప‌రామ‌ర్శించారు. ఆదివారం కుటుంబ సభ్యులు మత్యకారులను సమాచారం అడుగగా.. తాము దగ్గరలో ఉన్నామని  బోట్ ఇంజిన్ పాడైందని ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ స‌భ్యులు చెప్పారు. తమ దగ్గర ఉన్న ఒక్క ఫోన్  స్విచ్ఛాఫ్ అవుతుందని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకూ ఆచూకీ లభ్యం కాలేదని బాధితు కుంటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన పడవలో  మత్స్యకారులు విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35)లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించార‌ని నాని తెలిపారు. మత్యకారుల ఆచూకీ కోసం హెలికాప్టర్‌తో గాలిస్తున్నామని చెప్పారు. క్షేమంగా తిరిగొస్తారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్య‌క్తం చేశారు.  

తాజా వీడియోలు

Back to Top