విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, విభజించి పాలించడం ఆయన నైజం అని, అలాంటి వ్యక్తి చేతిలో దళిత నేతలు కీలు బొమ్మలు కావద్దు అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున సూచించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వైఫల్యం చెందారని, ఎప్పుడూ కుట్రలు, కుతంత్రాలు చేయడమే ఆయనకు అలవాటు అని విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన దళిత సమావేశం చంద్రబాబు రౌండ్ సమావేశంలా ఉందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా ఉన్నవారే సమావేశం పెట్టారని విమర్శించారు. విభజించి పాలించు అనేది చంద్రబాబు సూత్రమని ధ్వజమెత్తారు. దళిత ద్రోహి చంద్రబాబు.. చంద్రబాబు దళిత ద్రోహి అని మేరుగ నాగార్జున విమర్శించారు. సీఎం వైయస్ జగన్‌కు కులాలు మధ్య చిచ్చుపెట్టే అవసరం ఏమి ఉందని ప్రశ్నించారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దళితులు సంతోషంగా ఉన్నారు. దళితుల్లో పుట్టాలని అన్నప్పుడే.. రౌండ్ సమావేశం పెట్టిన వాళ్లు చంద్రబాబు మొహం మీద ఉమ్ము వేయాల్సింది. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన హర్షకుమార్ సీటు కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. సమావేశం పెట్టిన వారు నిజంగా దళితులైతే ముందు చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని కోరారు. దళిత పక్షపాతి సీఎం వైయస్ జగన్ సీఎం వైయస్ జగన్ దళిత పక్షపాతి అని మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై కుట్రలు కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. నిన్నటి సమావేశంలో బాబూ జగజ్జీవన్ రావు ఫోటో ఎందుకు పెట్టలేదు. చంద్రబాబు దళితులను వైఎస్సార్‌సీపీకి దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం చంద్రబాబు ఇంటి ముందు పెట్టాలి. . దళిత సంక్షేమానికి ఆయన పెద్ద పీఠ వేశారు. విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు' అని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.