స్పీకర్‌పై టీడీపీ సభ్యులు పేపర్లు విసరడం అనుచితం

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

అమరావతి: బీసీ సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై పేపర్లు విసిరి అనుచితంగా వ్యవహరించారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. సభను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేశారని, టీడీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా పాయింట్‌ వద్ద మేరుగ నాగార్జున మాట్లాడారు.  అసెంబ్లీలో టీడీపీ నేతల తీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఈ రోజు ప్రశ్నోత్తరాలపై చర్చించాల్సి ఉంది. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. వైయస్‌ జగన్‌ ఏవిధంగా పాలన సాగిస్తున్నారని చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సభా సమయాన్ని వృథా చేస్తూ..ఎక్కడో జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలతో చనిపోయిన సంఘటనలను కల్తీ మద్యంతో చనిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధం విధిస్తే చంద్రబాబు తూట్లు పొడిచారు. మద్యాన్ని ఏరులై పారించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం నిర్వీర్యం అయ్యింది. వైయస్‌ జగన్‌పై అంచెలంచెలుగా ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది. దీంతో టీడీపీ జీర్ణించుకోలేక ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా ఉంది. సామాజిక వర్గ రుగ్మతలు లేకుండా పాలన సాగుతోంది. బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌పై టీడీపీ నేతలు పేపర్లు చించి అసభ్యంగా ప్రవర్తించారు. చట్ట సభలో ఏం జరిగిందో అందరూ గమనించాలి. పేదలు, బడుగులు, బలహీనవర్గాలకు సీఎం వైయస్‌ జగన్‌ అవకాశాలు కల్పిస్తుంటే..చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. బాబు జంగారెడ్డిగూడెంలో డ్రామాలాడితే..సభలో ఆ పార్టీ నేతలు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు. జ్యోతిరావుపూలే, అంబేద్కర్‌ ఆలోచనలతో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాకు దొరికారని ప్రజలు సంతోషంగా ఉన్నారు. మాలాంటి బడుగు, బలహీన వర్గాల నేతలను చట్ట సభల్లోకి తెచ్చి గౌరవిస్తే..చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. టీడీపీ యుక్తులు, కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి సంక్షేమానికి ఆధ్యుడు, బావితరాల భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. విజ్ఞులైన టీడీపీ నేతలు తప్పులు చేయకుండా సభ సజావుగా సాగేలా సహకరించాలని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కోరారు. 
 

Back to Top