దేవాలయంలో దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా

 వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

దేవాలయంలో దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా? మోకాలికీ బోడిగుండికీ పెడతాడు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లున్నాయి? ఎన్ని ఎస్సీలకిచ్చాడు? ఎంతమంది గెలిచారు? ఒక్కరంటే ఒక్కరే గెలిచారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేసాడు చంద్రబాబు. ఎస్సీల్లో ఎవరు పుడతారు అన్నాడు. తన హాయంలో అన్ని దాడులు జరిగితే నోరు ఏడబోయిందో అడగడానికి? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆంబోతుల్లా మేసిన వాళ్లు ఇవాళ ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి నీతులు చెబుతుంటే బాధగా ఉంది. చంద్రబాబు నిజంగా రాజకీయ నాయకుడైతే దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నందుకు చట్టసభలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి బాబు రాజశేఖర్ రెడ్డి గురించి, జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. దళితులకు వాళ్లు చేసిన సేవ, దళితుల మీద వాళ్లకున్న విశ్వాసం ఎవ్వరికీ లేవు. చట్ట సభల్లో దళితులను అవమానించిన వ్యక్తివి. దళిత చట్టాలను చుట్టాలుగా చేసుకున్న వ్యక్తివి. దళితుల మీద దాడులు చేసిన వ్యక్తివి. నీకు మాట్లాడే అర్హత లేదు. ఆర్నెల్లైంది ప్రభుత్వం వచ్చి. దళితులకు ఏం చేసారంటున్నాడు బాబు. దళితులకు రావాల్సిన హక్కులు కాలరాసింది చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ పై చర్చ పూర్తయ్యాక ఫస్ట్ కేసు చంద్రబాబు మీద పెట్టాలి. దళితులకు అన్యాయం చేసింది ముమ్మాటికీ చంద్రబాబే.  

Back to Top