మ‌హానేత ఆశ‌యాల‌కు అనుగుణంగా వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

విజ‌య‌వాడ‌లో అన్న‌దాన కార్య‌క్ర‌మం

విజ‌య‌వాడ‌: మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నార‌ని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. వైయ‌స్ఆర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ న‌గ‌రంలోని 62 వ డివిజన్, ఎల్ బి ఎస్ నగర్ ఖాదర‌మ్మ కొట్టు  సెంటర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల   ఆధ్వర్యంలో 1000 మందికి  అన్నదాన  కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లా విష్ణు మాట్లాడుతూ.. వైయ‌స్ రాజశేఖరరెడ్డి మనందరికీ దూరమై నేటికీ 12ఏళ్లు గడిచాయని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పధకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలకు కుల, మత, పార్టీ, బేధం లేకుండా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. భావితరాల భవిష్యత్‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో 62 వ డివిజన్ కార్పొరేటర్   అలంపూర్ విజయలక్ష్మి, అలంపూర్ విజయ్, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు నందేపు  జగదీష్, డివిజన్ కోఆర్డినేటర్ వీరబాబు, వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు... కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top