స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బాబు బస్సు యాత్ర

ఎమ్మెల్యే మల్లాది విష్ణు 
 

విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు బస్సు యాత్రలు చేపట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడ నగరంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఉగాది నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే  విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 35 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న వసతిదీవెన ద్వారా రూ. 10వేలు విద్యార్థుల ఖాతాలో జమయ్యాయని వెల్లడించారు. విద్య పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లాలనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. 

తాజా వీడియోలు

Back to Top