క‌డ‌ప కార్పొరేష‌న్ వ‌ద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం 

వైయ‌స్ఆర్ జిల్లా : కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్‌ సమావేశంలోకి వెళ్లారు. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారు. దీనిపై మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ కాదని ఎజెండా ప్రకారం సమావేశం జరగాలని పాలకవర్గం సూచించినా టీడీపీ ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించారు. జిల్లా సంఘ‌ట‌న‌లు చూసిన త‌రువాత అయ్యో ఇలాంటి వారిని మేం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామా అని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించ‌కుండా నియంత‌లాగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌న్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా మీటింగ్ హాల్‌లోకి చొచ్చుకొచ్చారు. మేయ‌ర్‌, డిప్యూటి మేయ‌ర్‌ను డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఇవాళ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నార‌ని మేయ‌ర్ సురేష్‌బాబు మండిప‌డ్డారు.
 

Back to Top