ఆరోపణలు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

తాడేపల్లి: తనపై చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చాలేంజ్‌ చేశారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి చంద్రబాబు, లోకేష్‌ తప్పుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రాబు నివాసం అక్రమ కట్టడం కాదా అని నిలదీశారు. తాను రైతుల వద్ద భూమి కొనుక్కుని ఇల్లు నిర్మించుకున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబులా రైతులను బెదిరించి భూములు లాక్కోలేదన్నారు. చంద్రబాబులా అక్రమ నిర్మాణంలో నివసించట్లేదన్నారు. 
 

Back to Top