కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు జిల్లాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేయబోతుందని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. పత్తికొండలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలే ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీని గెలిపిస్తాయన్నారు. తొమ్మిది నెలల పాలనలోనే సీఎం వైయస్ జగన్ నవరత్నాలను అమలు చేశారన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి, వాహన మిత్ర వంటి పథకాలు అర్హులందరికీ అందజేశామన్నారు. మళ్లీ వైయస్‌ఆర్ సీపీకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా రైతులకు గిట్టుబాటు ధరను సీఎం వైయస్ జగన్ కల్పించారని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.