విజయనగరం: ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. జై జగన్ అంటూ ఆడపడుచుల నినాదాలు చేస్తున్నారు. పార్వతీపురం - మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కంబర,చిట్టపులివలస,కిమ్మి, కొట్టుగుమ్మడ,గడగమ్మ గ్రామాల్లో వైయస్ఆర్ సీపీ ప్రచారం హోరెత్తుతోంది. గత ఐదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనతో ఎన్నో సంక్షేమ పధకాలను పొందాం, మరెన్నో అభివృద్ధి పనులకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మళ్లీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా.. అవ్వాతాతలకు కాలు కదపకుండా ఇంటి వద్దే పింఛన్ అందాలన్నా... అది మీచేతుల్లో చేతల్లోనే ఉంది...మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేసి వైయస్ జగన్ నాయకత్వాన్ని గెలిపించాలని పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ లు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కంబర, చిట్టపులివలస, కుమ్మ, కొట్టుకున్నాడు, గడగమ్మ గ్రామాల్లో వీరు ముమ్మర ప్రచారం చేశారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి సామాజిక భద్రత,బరోసా సంక్షేమానికి, స్వావలంబనకు పెద్దపీట, సమసమాజ స్థాపన చేస్తూ.... అన్ని వర్గాల ప్రజల సుఖసంతోషాలే ధ్యేయంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పాలన సాగుస్తున్నారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేశారు: గత టీడీపీ ఆరాచక పాలనతో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. స్వాతంత్య్రం నాటి నుండి ఉన్న వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిసంప్రదాయాలను మంటగలిపిన టీడీపీ కి 2019లో ప్రజలు గట్టి బుద్ధి చెబుతూ ఇంటికి సాగనంపారని అన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా ఎన్నికల కమీషన్ కు టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసి అవ్వాతాతలకు పింఛన్లు ఇంటివద్ద ఇవ్వనీయకుండా అడ్డుకుందని ప్రజలకు వివరించారు. టీడీపీకి అవకాశం ఇస్తే ప్రజలను నిలువునా దోచుకుంటారని అన్నారుగత పదేళ్లుగా ప్రజల ఆధరాభిమానాలతో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న మన ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేసి విశ్వాసరాయి కళావతిని మూడో సారి శాసనసభకు పంపించాలని ప్రజలను కోరారు జనం జేజేలతో హోరెత్తిన ప్రచారం.. ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే అభ్యర్ధి విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వస్తున్నట్లు తెలియడంతో కంబర,చిట్టపులివలస,కుమ్మి,గడగమ్మ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారుఎమ్మెల్యే కళావతికి, ఎమ్మెల్సీ విక్రాంత్ కు మహిళలు హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు.మహిళలు, యువకులు ఉత్సాహంగా డాన్సులు చేసారు.అన్న వస్తున్నాడంటూ జేజేలు పలికారు. రావాలి జగన్-కావాలి జగన్ అంటూ నినాదాలు చేసారు. ప్రచారంలో ఎంపీపీ ధమలపాటి వెంకటరమణ నాయుడుతో పాటు వైయస్ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.