అమరావతి రైతులను అడ్డు పెట్టుకొని టీడీపీ యాత్ర 

 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి 
 

నెల్లూరు: అమరావతి రైతులను అడ్డు పెట్టుకొని టీడీపీ యాత్ర చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి మండిప‌డ్డారు. అమరావతి రైతులది ఒక్క ప్రాంతానికి సంబంధించిన యాత్ర అని విమర్శించారు.  గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. రైతు యాత్రని రాజకీయ యాత్రగా మార్చారని, అమరావతి రైతులను అడ్డు పెట్టుకొని టీడీపీ యాత్ర చేస్తోందని మండిపడ్డారు. పాదయాత్రలు చేసేవారు న్యాయస్థానం ఆదేశాలు పాటించాలన్నారు. కావాలని ఉద్రిక్తలు సృష్టించడం సరికాదన్నారు. కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు తుంగలో తొక్కి పాదయాత్రలా అని ప్రశ్నించారు.

అమరావతి యాత్రల్లో శనిలా సోమిరెడ్డి ప్రవేశించాడని, అందుకే వాళ్ళకి కష్టాలు ప్రారంభం అయ్యాయని దుయ్యబట్టారు. సోమిరెడ్డి చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకు అసత్య ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము  వసతి కల్పించకుండా అడ్డుకొన్నట్టు ఆధారాలుంటే చూపాలని డిమాండ్‌ చేశారు.

Back to Top