చంద్రబాబు క్షమాపణ చెప్పాలి 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత‌ వ్యాఖ్యలకు బాధ్య‌త వ‌హిస్తూ చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి డిమాండు చేశారు.  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను నిందించేందుకు బాబు త‌న పార్టీ నేత‌ల‌ను ప్రోత్సహించడం, ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి పన్నాగం ప‌న్నార‌ని మండిప‌డ్డారు.  ఆంధ్ర రాష్ట్రంలో యువత  మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారంటూ, తెలుగుదేశం నాయకులు ప్రచారానికి పూనుకోవడం నీచాతి నీచమ‌న్నారు.  చంద్రబాబు కుమారుడు లోకేష్ మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడంటే, చంద్రబాబు తట్టుకోగలడా! అని నిల‌దీశారు. చంద్రబాబు తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రంలోని తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయ‌న్నారు.  నోరు అదుపులో పెట్టుకోవాలని, ఒళ్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు తక్షణమే పట్టాభి లాంటి నీచుడు చేసిన దురదృష్టకర వ్యాఖ్యలకు స్పందించి, క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top