అనంతపురం: ప్రజా సంక్షేమమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం, సంజీవపురం గ్రామంలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పథకాలు ఎవరికైనా అందలేదా? అని ఆరాతీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు . రాష్ట్రంలో ఒకప్పుడు వృద్ధులు పెన్షన్ అందుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసలు పడే వారు, కానీ నేడు ప్రతినెలా ఇంటింటికీ వచ్చి పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. ఇదే గ్రామానికి చెందిన భీమిరెడ్డి మురళీమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే పద్మావతి.. ఆయన పేరు మీద ముఖ్యమంత్రి జగనన్న రాసిన లేఖను చూపించారు. అందులో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అందించిన లబ్ధిని వివరించారు. వైయస్సార్ ఫించను కానుక ద్వారా: రూ.1,90,000; వైయస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా: రూ. 10,000; వైయస్సార్ ఆసరా ద్వారా : రూ. 65,604; వైయస్సార్ రైతు భరోసా ద్వారా : రూ. 61, 500; వైయస్సార్ సున్నా వడ్డీ ద్వారా : రూ. 8,113; వైయస్సార్ ఆరోగ్యశ్రీ, ద్వారా : రూ. 33,786; జగనన్నఅమ్మ ఒడి ద్వారా : రూ. 29,000; పథకాలన్నీ కలిపి మొత్తం రూ.3,98,003 అందించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధి దారుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాల ద్వారా తమ కుటుంబం ఎంతో లబ్ధి పొందిందని ఎమ్మెల్యే వద్ద ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుక కింద రాష్ట్రంలో 61.75లక్షల మంది లబ్ధిదారులకు 35 నెలల్లో దాదాపు రూ.50,505 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇది జగనన్న పరిపాలన దక్షతకు నిదర్శనమని అన్నారు. కానీ దుష్ట చతుష్టయంలోని చంద్రబాబు ఏనాడైనా ప్రజల దగ్గరికి వెళ్లారా? అని ప్రశ్నించారు. మేము ఇంటింటికి తిరుగుతున్నాం, ఊరూరు తిరుగుతున్నాం, గడపగడపకు తిరుగుతున్నాం మరి ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇలా తిరిగారా? అని ప్రశ్నించారు. ఈ చౌకబారు రాతల్ని, మాటల్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఓటుతో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల కన్వీనర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.