గ్రామాభివృద్ధిలో భాగ‌స్వాములు కండి

ఉప స‌ర్పంచులు, వార్డు మెంబ‌ర్ల శిక్ష‌ణా త‌ర‌గ‌తుల్లో ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి 
 

అనంత‌పురం:  గ్రామాభివృద్ధిలో వార్డు మెంబ‌ర్లు భాగ‌స్వాములు కావాల‌ని శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పిలుపునిచ్చారు. అనంత‌పురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని మండ‌ల ప‌రిష‌త్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచులు, వార్డ్ నెంబర్ల ప్రాథమిక శిక్షణ కార్యక్రమం లో ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ.. ఒకనాటి ప్రజా సేవ వేరు, అప్పుడు గ్రామంలో సమస్య వస్తే, పరిష్కారం కోసం తిరిగేవారు. ఇప్పుడు అవసరం లేద‌న్నారు. అన్ని ర‌కాల సేవ‌లు స‌చివాల‌యాల్లోనే దొరుకుతున్నాయ‌న్నారు. మారుతున్న కాలంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు.  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారని అన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top