సీఎం వైయస్‌ జగన్‌ వెలుగులు నింపారు

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
 

అసెంబ్లీ: సీఎం వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు నింపారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని మొదటి నుంచి సీఎం ఆలోచన. ఇంగ్లీష్‌ మీడియంలో చదువకున్నంత మాత్రాన తెలుగు రాదనడం సరికాదు. ప్రస్తుత కాలంలో ఇంగ్లీస్‌ విద్య తప్పనిసరి.
వికేంద్రీకరణ బిల్లు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదు.ప్రాథమిక విద్య తెలుగు మీడియంలో ఉండి.. ఉన్నత విద్య ఇంగ్లీష్‌ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి సీఎం వైయస్‌ జగన్‌పై రాసిన కవితను సభలో చదివి వినిపించారు. నీవు అనుకుంటే అవుతుంది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోసం శాపం.. నీ మాట శాసనం స్వామీ..అంటూ ఇంగ్లీష్‌ మీడియం అమలు బిల్లుకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 
 

Back to Top