పెగాసస్‌ స్పైవేర్‌పై సమగ్రమైన విచారణ జరగాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  గుడివాడ అమర్‌నాథ్‌
 

అమ‌రావ‌తి: పెగాసస్‌ స్పైవేర్‌పై సమగ్రమైన విచారణ జరగాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  గుడివాడ అమర్‌నాథ్ కోరారు. సోమ‌వారం పెగాసస్‌పై ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో అమ‌ర్‌నాథ్ మాట్లాడారు. వాస్తవాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై మాట్లాడరు కదా అని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉయోగించారని అ‍న్నారు. బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం  మమతా తెలిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అనైతిక రాజకీయవేత్త అని అన్నారు. తేలుకుట్టిన దొంగలా  చంద్రబాబు ఉన్నారని అన్నారు. సీఎం మమతా ఆరోపణలపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్కసారైనా సొంతంగా అధికారంలోకి వచ్చారా? అని అమ‌ర్‌నాథ్ ప్ర‌శ్నించారు. 

Back to Top