ఎచ్చెర్ల: అర్హులందరికీ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జె.ఆర్.పురం సచివాలయం1 పరిధిలోని గరికిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గడప గడపకూ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందయా లేదా అంటూ ఆరా తీశారు.
ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపకు వెళ్తామన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని,ప్రతి కుటుంబంతోనూ మనసు విప్పి మాట్లాడడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడగడం జరుగుతుందన్నారు. నవరత్నాలలో భాగంగా కులాలకు,మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగనన్న ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలను అమలు చేశామని, శాచ్యురేషన్ మోడ్లో పథకాలను అందించామన్నారు. గడపగడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో మహిళలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ జగనన్నకు మద్దతు పలుకుతున్నారని,మరో 30 - 40 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగేలా తామంతా కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో రణస్థలం మండల జడ్పీటీసీ టొంపల సీతారాం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, బూత్ కమిటీ కన్వీనర్ చిల్ల వెంకటరెడ్డి, మండలం వైస్ ఎంపీపీలు రాయపురెడ్డి బుజ్జి, మైలపల్లి కామరాజు, నాయకులు గొర్లె అప్పలనర్సు నాయుడు,కిరణ్ యువసేన అధ్యక్షులు పిసిణి చిన్నంనాయుడు,జె.ఆర్.పురం పంచాయతీ సర్పంచ్ బవిరి రమణ,ఎంపీటీసీ పచ్చిగుళ్ల సాయిరాం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.