అభివృద్ధి..సంక్షేమాన్ని మ‌రువ‌ద్దు

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో గొర్లె కిర‌ణ్‌కుమార్‌

ఎచ్చెర్ల‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు మ‌ర‌చిపోవ‌ద్ద‌ని ఎచ్చెర్ల  ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొండములగాం గ్రామ సచివాలయం పరిధిలోని కమ్మసిగడాం పంచాయతీ యాగాటిపాలెం, కాకిపాలెం, లోచెర్లపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమం నిర్వ‌హించారు.  ప్రజలను నేరుగా కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను ఎమ్మెల్యే కిర‌ణ్‌కుమార్ అంద‌జేశారు.  ప్రజల సమస్యలు తెలుసుకుంటూ - ప్రభుత్వ పథకాలను వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన ల‌భించింది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో గడిచిన నాలుగేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు  చెప్పారు.  టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లలో అమ్మ ఒడి, వైయ‌స్సార్‌ ఆసరా, చేయూత తదితర పథకాలు అందించడంతోపాటు నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆస్పత్రుల, రోడ్లను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన వారు వచ్చే ఎన్నికల్లో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.   

కార్యక్రమంలో రణస్థలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జడ్పీటీసీ టొంపల సీతారాం, జే.సి.యస్ మండల ఇంచార్జి చిల్ల వెంకటరెడ్డి, నాయకులు గొర్లె అప్పలనర్సునాయుడు, కమ్మసిగడాం పంచాయతీ సచివాలయం కన్వీనర్ సింక గౌరిసూర్య, కొండములగాం ఎంపీటీసీ ప్రతినిధి రెడ్డి వాసు, నాయకులు కలిశెట్టి కన్నంనాయుడు, గొర్లె చైతన్య, కమ్మసిగడాం పంచాయతీ నాయకులు లోచెర్ల కృష్ణ,పి. నగేస్,యాగాటి గణేష్,ఎంపీటీసీ రెడ్డి లక్ష్మి,కొండములగాం గ్రామ సచివాలయం కన్వీనర్లు,గృహ సారధులు,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top