క్యాడర్‌ను కాపాడుకోవడానికి బాబు కుట్ర

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

గుంటూరు: పల్నాడు ప్రాంతంలో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పునరావాస కేంద్రాల్లో రౌడీషీటర్లను పెట్టుకొని మాట్లాడడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కుమ్మెత కోటిరెడ్డి అనే వ్యక్తి రౌడీ షీటర్‌. అతనిపై ఏడు కేసులు ఉన్నాయి. అతన్ని పునరావాస కేంద్రంలో చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. అంటే అతనిపై కేసులు ఎత్తేసి గ్రామాల్లో ఊరేగింపు చేయాలా.. చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం అని నిలదీశారు. 2014 నుంచి 2019 మధ్యలో ఐదుగురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేశారు. ఇప్పుడు ఏమైనా అలాంటి ఘటనలు జరిగాయా..? గ్రామ బహిష్కరణ అని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఎన్ని గ్రామాల నుంచి వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలను బహిష్కరించారో చెబుతామన్నారు. పొలంలో పండిన పంటను ఇంటికి కూడా తీసుకెళ్లనివ్వకుండా కుట్ర చేశారు. ఇవన్నీ వాస్తవం కాదా చంద్రబాబూ.. అని ప్రశ్నించారు. పునరావాస కేంద్రానికి అధికారులకు పంపించినా చంద్రబాబు ఏదో కుట్ర చేయాలని చూస్తున్నాడన్నారు. చంద్రబాబు పార్టీ నాయకులంతా తప్పులు చేసి పరారీలో ఉన్నారన్నారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. పల్నాడు ప్రాంతంలోని గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top