బాబుకు వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు

ఉద్యోగులంటే చంద్రబాబుకు చులకన

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు

అసెంబ్లీ: చంద్రబాబుకు వయస్సు పెరిగింది కానీ, మనస్సు పెరగలేదు.. జ్ఞానం అనేది భగవంతుడు ఇవ్వలేదు.. నిన్న మార్షల్స్‌పై చంద్రబాబు, టీడీపీ సభ్యులు చేసిన దాడిని నేను కళ్లారా చూశానని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. ఉద్యోగస్తులను పట్టుకొని చంద్రబాబు ఒళ్లంతా ఉన్మాదంతో మాట్లాడారన్నారు. ఉద్యోగులంటే చంద్రబాబు మరీ చులకన అని, నిన్న జరిగిన సంఘటన ఉద్యోగస్తులందరికీ అవమానంగా భావిస్తున్నానన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ..
‘నిన్న జరిగిన సంఘటన కళ్లారా గేటు దగ్గర చూశాను. ఎంతటి దారుణం అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉద్యోగస్తులను పట్టుకొని ఒళ్లంతా ఒకరకమైన ఉన్మాదంతో మాట్లాడాడు. నేను దానికి సాక్షం కూడా.. నేను వైజాగ్‌ జిల్లాలో జెడ్పీ∙సీఈఓగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు. సత్యం చెబుతున్నా.. చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన, అందులోనూ మాలాంటి పేదవర్గానికి చెందిన ఉద్యోగులు అంటే మరీ చులకన. ఐ విల్‌ సస్పెండ్, ఐ విల్‌ డిస్మిస్‌ అని చెప్పి కొన్ని వందల సార్లు చంద్రబాబు మాటలు కళ్లారా చూశాను.. విన్నాను. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వ ఉద్యోగులందరికీ నిజమైన అవమానంగా భావిస్తున్నాను.
బాబుకు వయస్సు పెరిగింది కానీ, మనస్సు పెరగలేదు. జ్ఞానం అనేది భగవంతుడు చంద్రబాబుకు ఇవ్వలేదు. సభ సాక్షిగా చెబుతున్నా.. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్ని కష్టాలు పడినా.. పదేళ్లలో చంద్రబాబును, ఎవరినైనా ఒక్క దుర్భాష కూడా మాట్లాడలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్మాదంలా ప్రవర్తించారు. ఐదు కోట్ల మంది ప్రజలంతా టీడీపీ తీరుపై బాధపడుతున్నారు. ప్రతిపక్షానికి ఆలోచన ఉంటే ఈ పాటికే క్షమాపణ చెప్పి ఉండాలి. పేదల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు ఏమన్నా.. 5 కోట్ల మంది ప్రజలు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గమనిస్తున్నారు. టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని గమనించాలని ఎమ్మెల్యే బాబురావు సూచించారు.

Read Also : చంద్రబాబు దగ్గర ఇరుక్కుపోయిన రాక్షసుడి కథ

 

తాజా ఫోటోలు

Back to Top