అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరం

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు

చంద్రబాబు అండ్‌ కో మాత్రమే వ్యతిరేకం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు
 

విశాఖపట్నం: ఆంధ్రరాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఏపీకి నిజమైన సౌలభ్యం జరుగుతుందని ఆ రోజున శివరామకృష్ణన్‌ కమిటీ చాలా క్లియర్‌గా చెప్పిందని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాలను కూడా సమభావంతో చూసి ప్రతిపాదన చేసినట్లుగా భావిస్తున్నానన్నారు. అమరావతిలో చట్టసభలు, కర్నూలులో హైకోర్టు, ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే దాని వల్ల లాభం ఏంటీ అని వివరంగా ఆలోచించి సుదీర్ఘమైన సలహాలు తీసుకున్న తరువాతే చెప్పి ఉంటారని భావిస్తున్నానన్నారు. మూడు రాజధానులను టీడీపీ నేతలు కూడా స్వాగతిస్తున్నారని, చంద్రబాబు అండ్‌ కో మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్నారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆలోచన, అభివృద్ధి వికేంద్రీకరణతో పాలన ప్రజల చెంతకు చేరుతుందని కొంచెం అనుభవం ఉన్న వ్యక్తిగా, పేద ప్రజల ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నానని చెప్పారు. హైదరాబాద్‌ను రాజధానిగా భావించి  అభివృద్ధి కోసం ఎన్నో సంస్థలు తీసుకువచ్చి బ్రాహ్మాండమైన నగరంగా రూపుదిద్దుకున్నాం.. కానీ, రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయామన్నారు. అలా భవిష్యత్తులో జరగకుండా వికేంద్రీకరణ తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని చెప్పారన్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారని, చంద్రబాబు అండ్‌ కో మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్నారు. విశాఖపట్నంలో ఉండి ఎలా పరిపాలన చేస్తారని చంద్రబాబు అడుగుతున్నారని, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెడితే ప్రజలు క్యాపిటల్‌కు రావాల్సిన అవసరం లేదు.. ప్రజలకు కావాల్సిన అవసరాలు, పథకాలు అన్నీ జిల్లాల్లోని అధికారులు, నాయకులు చూసుకుంటారని చెప్పారు. విశాఖపట్నం రావడానికి రైలు, రోడ్డు, ఎయిర్‌లైన్స్‌ కనెక్టివిటీ ఉందని గుర్తుచేశారు. దేశంలో చాలా రాష్ట్రాలు చూస్తే అన్ని వసతులు ఉన్న నగరాలనే క్యాపిటల్‌గా పెట్టుకున్నారన్నారు. దేశ రాజధాని ఢిల్లీ అన్ని రాష్ట్రాలకు మధ్యలో ఉందా..? అని చంద్రబాబును ప్రశ్నించారు.

విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అయితే చాలా పరిశ్రమలు, ఇన్వెస్ట్‌మెంట్లు కూడా భారీగా వస్తాయని ఎమ్మెల్యే గొల్ల బాబురావు చెప్పారు. చంద్రబాబు అండ్‌ కో అనేక విషయాల్లో యూటర్న్‌ తీసుకున్నారని, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడి.. సభలో అనుకూలం అని చెప్పారని గుర్తుచేశారు. ఏది తోస్తే దాని గురించి మాట్లాడడం చంద్రబాబు నైజమన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలంతా గుణపాఠం చెబుతారన్నారు. తొందరలోనే కమిటీ రిపోర్టు వస్తుందని, తరువాత ముఖ్యమంత్రి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్నారు.

 

Back to Top