బీసీ కమిషన్‌తో అందరికి న్యాయం

ఎమ్మెల్యే చెల్లిబోయిన వేణుగోపాల్‌

చంద్రబాబును ప్రజలు క్షమించరు

వైయస్‌ జగన్‌ దేవుడిలా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు

అమరావతి: బీసీ కమిషన్‌తో అందరికి న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. బీసీల అభివృద్ధి కోసం బీసీ కమిషన్‌ బిల్లు తీసుకురావడం హర్షణీయమని, ఈ బిల్లును అడ్డుకోవడం టీడీపీకి తగదన్నారు. బీసీలకు మేలు జరిగితే టీడీపీ వినలేకపోతుందన్నారు. 
ప్రతిపక్ష సభ్యులు ఉదయం నుంచి కూడా సభ సజావుగా జరుగకుండా అడ్డుపడుతుండటం బాధాకరమన్నారు. కీలకమైన బిల్లులపై జరుగుతున్న చర్చలకు అంతరాయం కలిగించిన టీడీపీ నేతలను ప్రజలు క్షమించరు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చాలా సందర్భాల్లో బీసీలు మాకు వెన్నుముక అన్నారు..అలాంటి మీరు ఇవాళ బీసీ బిల్లులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళల సాధికారికత కోసం ప్రభుత్వం బిల్లులు రూపొందిస్తే..ఎక్కడ వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందో అన్న భయంతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. బీసీల హక్కులను కాలరాస్తున్నారు. బీసీలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు బీసీ ఎమ్మెల్యేలను నిలబెట్టించి గందరగోళం చేయిస్తున్నారు. బీసీల న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే వీళ్లు ఆందోళన చేపట్టడం సిగ్గుచేటు అన్నారు. బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి. బీసీ కమిషన్‌తో అందరికి న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీలపై ఏమాత్రం గౌరవం ఉన్నా సరే ప్రతిపక్ష సభ్యులు పోడియం నుంచి కిందికి రావాలన్నారు. జ్యోతిరావుపూలే, బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో ఆ నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. జగన్‌ అంటే నిజమని, నిజానికే ఓటు వేయమని రామచంద్రాపురంలో ఒక చిన్న నినాదం రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిందన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అడ్డుపడటం బాధాకరమన్నారు. సామాన్య కుటుంబం నుంచి, గీతాకార్మిక కుటుంబం నుంచి నన్ను తీసుకొని వచ్చిన వైయస్‌ జగన్‌ గొప్ప వ్యక్తి అన్నారు. మూడు రోజులుగా టీడీపీ నేతలు సభా సాంప్రదాయాలను విస్మరించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీసీ సమస్యల పరిష్కారం కోసం కమిషన్‌ వస్తుంటే అడ్డుపడుతున్న టీడీపీ నేతలను చరిత్ర క్షమించదని హెచ్చరించారు.  వైయస్‌ జగన్‌ దేవుడిలా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన మంజునాథ్‌ కమిషన్‌ ఏమైందని ప్రశ్నించారు. బీసీ కమిషన్‌ బిల్లును రూపొందించిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వేణుగోపాల్‌ అభినందనలు తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top