ప్రతీ పేదవాడి ఆరోగ్యానికి భరోసా  

జగన్నన ఆరోగ్య సురక్ష కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే  బడ్డుకొండ అప్పలనాయుడు

విజ‌య‌న‌గ‌రం:  రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడి ఆరోగ్యానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పిస్తూ జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్నార‌ని ఎమ్మెల్యే  బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. జగన్నన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా డేంకాడ మండలం గోలగం గ్రామంలో హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు.   ఈ సంద‌ర్భంగా రోగుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల గురించి వివ‌రాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు నిర్వహించే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపులను  సీఎం వైయస్ జ‌గ‌న్ ప్రారంభించార‌ని తెలిపారు.  5 వేల మందికిపైగా డాక్టర్లతో 1.67 కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ, 14 రకాల డయాగ్నస్టిక్ కిట్స్, 172 రకాల మందులతో 10,574 ఉచిత ఆరోగ్య సురక్ష క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తుంద‌న్నారు.  గత ప్రభుత్వంలో ఎం.ఎల్ ఏ లు ఎలక్షన్స్ కి మాత్రమే ప్రజలు దగ్గరకి వచ్చేవారు, ఇప్పుడు మన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ప్రభుత్వంలో 365 రోజులు ప్రజలు అందుబాటులో ప్రజల మధ్య ఉంటున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకంగా ప‌రిపాల‌న సాగిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలిపించి మనం అందరం రుణం  తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.   
 కార్యక్రమంలో డేంకాడ మండల ఎం పి పి బంటుపల్లి వాసుదేవరావు,  వైస్ ఎం పి పి పిన్నింటి తమ్మినాయుడు, పూసపాటి రేగ మండల ఎం పి పి ప్రతినిధి మహంతి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మహంతి జనార్దన్, మండల పార్టీ ప్రెసిడెంట్ అప్పలనాయుడు  , వైస్ ఎం పి పి చంటి రాజు , జిల్లా మత్సకార అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top